ఏపీ శాసనమండలి రద్దు చేస్తూ ప్రభుత్వం తీర్మానాన్ని అసెంబ్లీలో ఆమోదించి కేంద్రానికి పంపించింది. ఇక కేంద్రం ఉభయసమావేశాల్లో ఆమోదించిన మరుక్షణం ఏపీ శాసనమండలి అధికారికంగా రద్దు అవుతోంది. .శాసన మండలి రద్దు, పునరుద్ధరణ అంశాలు ఆయా రాష్ట్ర ప్రభుత్వాల పరిధిలో ఉంటాయి. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం పెద్దగా జోక్యం చేసుకోదు..ఏదైనా రాష్ట్ర ప్రభుత్వం తమ రాష్ట్రంలో శాసనమండలిని రద్దు చేస్తూ తీర్మానం పంపిస్తే కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగా వ్యవహరించి ఆమోదముద్ర వేసి పంపిస్తుంది. ఇందులో అడ్డుచెప్పడానికి రాజకీయ కారణాలను కేంద్రం చెప్పలేదు.
అయితే చంద్రబాబు మాత్రం మండలి రద్దుకు కేంద్రం సహకరించదని, ఒక వేళ కేంద్రం ఆమోదించాలన్నా…కనీసం రెండేళ్లు సమయం తీసుకుంటుందని అడ్డగోలుగా వాదిస్తున్నాడు. అంతే కాదు మండలి రద్దును అడ్డుకోవడానికి చంద్రబాబు ఢిల్లీ వేదికగా రాజకీయాలు చేస్తున్నాడు. ఇక ఎల్లోమీడియా ఛానళ్లు, పత్రికలైతే రాజకీయ కారణాలతో శాసనమండలిని రద్దు చేసిన జగన్ సర్కార్‌పై కేంద్రం ఆగ్రహంతో ఉందని పచ్చ కథనాలు వండివారుస్తున్నాయి. మూడు రాజధానుల బిల్లును , శాసనమండలి రద్దును వ్యతిరేకిస్తున్న ఏపీ బీజేపీ జగన్ సర్కార్‌పై బీజేపీ అధిష్టానానికి ఫిర్యాదు చేశారని..దీంతో రాజకీయ కారణాలతో శాసనమండలి రద్దు విషయాన్ని కేంద్రం పక్కన పెడుతుందని బాబు అనుకుల మీడియా ఛానళ్లు గొంతు చించుకుని అరుస్తున్నాయి. అయితే శాసనమండలి రద్దు విషయంలో కేంద్రం వైఖరిపై చంద్రబాబు అనుకుల మీడియాలో జరుగుతున్న ప్రచారంపై బీజేపీ ఎంపీ జీవిఎల్ నరసింహారావు స్పందించారు.
తాజాగా మీడియాతో మాట్లాడిన జీవిఎల్ ఆంధ్రప్రదేశ్ శాసన మండలి రద్దుపై కేంద్ర ప్రభుత్వం రాజ్యాంగబద్ధంగానే వ్యవహరిస్తుందని తెలిపారు. శాసనమండలిని రద్దు చేస్తూ ఏపీ అసెంబ్లీ చేసిన తీర్మానానికి కేంద్రం అడ్డు చెప్పే అవకాశం లేదని స్పష్టం చేశారు. శాసనమండలి రద్దుపై పార్లమెంట్ స్టాండింగ్ కమిటీ సూచనలు మాత్రమే చేస్తుందని, ఆ సూచనలపై అంతిమ నిర్ణయం పార్లమెంటు తీసుకుంటుందని తెలిపారు. మండలి రద్దు విషయంలో ఉద్దేశపూర్వకంగా రాజకీయ కారణాలతో జాప్యం చేసే ఆలోచన కేంద్రానికి లేదని జీవిఎల్ తేల్చి చెప్పారు. మొత్తంగా ఏపీ శాసనమండలి రద్దును ఢిల్లీలో అడ్డుకుంటామని ధీమాగా ఉన్న చంద్రబాబు గుండెల్లో జీవిఎల్ బాంబు పేల్చాడు. దీంతో చంద్రబాబు ఢిల్లీలో చక్రం తిప్పుతాడని భజన చేస్తున్న ఎల్లోమీడియాకు జీవిఎల్ వ్యాఖ్యలు షాక్ ఇచ్చాయనే చెప్పాలి.