వికేంద్రీకరణ బిల్లుపై జరిగిన పరిణామాలతో జగన్ సర్కార్ ఏకంగా ఏపీ శాసనమండలిని రద్దు చేసింది. దీంతో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీ నేతల మధ్య మాటల యుద్ధం తారాస్థాయికి చేరుకుంది. శాసనమండలి రద్దు చేసే అధికారం మీకెవడు ఇచ్చాడు…మండలి రద్దు చేయడం అంత ఆషామాషీ కాదు..మేం అధికారంలోకి వస్తే మళ్లీ పునరుద్ధరిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వంపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు గతంలో శాసనమండలిని రద్దును సమర్థిస్తూ అన్న మాటల వీడియోను అసెంబ్లీలో ప్రదర్శించి వైసీపీ గట్టి కౌంటర్ ఇచ్చింది..గతంలో శాసనమండలితో ప్రజాధనం వేస్ట్ అంటూ రద్దు చేసింది..మీ టీడీపీ ప్రభుత్వమే కదా అంటూ వైసీపీ నేతలు విరుచుకుపడుతున్నారు.
తాజాగా వైసీపీ ఎమ్మెల్యే, ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్ రెడ్డి చంద్రబాబుకు గట్టి సవాలే విసిరారు… ఉత్తరాంధ్రలో రాజధాని అవసరంలేదని చెప్పే ధైర్యం అక్కడకు వెళ్లి చెప్పే ధైర్యం మీకుందా అంటూ చంద్రబాబును గడికోట ప్రశ్నించారు. ఇక వెనుకబడిన కర్నూలులో హైకోర్టు అవసరంలేదని బహిరంగంగా చెప్పగలరా అని సవాల్ విసిరారు. శాసనమండలి రద్దుపై చంద్రబాబుకు మాట్లాడేందుకు ముఖం చెల్లడం లేదని గడికోట ఎద్దేవా చేశారు. అందుకే ఫ్రస్టేషన్‌లో సీఎం జగన్ వైయస్‌ను కొట్టారంటూ..విజయమ్మ రోశయ్యకు చెప్పారంటూ…వ్యక్తిగత విమర్శలు చేస్తూ…దిగజారుడు రాజకీయాలు చేస్తున్నారని మండిపడ్డారు.
అసలు శాసనమండలి రద్దుకు టీడీపీ వ్యతిరేకమైతే అసెంబ్లీలో చర్చకు ఎందుకు హాజరుకాలేదని గడికోట లాజిక్ లేవనెత్తారు. అసత్యాలు ప్రచారాలు చేస్తూ.. ప్రజలను పక్కదారి పట్టించడంలో చంద్రబాబు బ్రాండ్ అంబాసిడర్ అని ఫైర్ అయ్యారు. బాబులా దిగజారి మాట్లాడటానికి మాకు సంస్కారం అడ్డొస్తోందని గడికోట అన్నారు. ఐదేళ్ల పదవీ కాలంలో కనీసం దుర్గగుడి ఫ్లై ఓవర్ కూడా పూర్తి చేయలేని చంద్రబాబు రాజధానిని ఎలా నిర్మించగలరని ప్రశ్నించారు. చంద్రబాబు చరిత్ర ఎలాంటిదో మాజీ సీఎం నాదెండ్ల భాస్కర్‌రావు రాసిన పుస్తకం చూస్తే తెలుస్తుందని శ్రీకాంత్ రెడ్డి ఈ సందర్భంగా గుర్తుచేశారు. మొత్తంగా పదునైన విమర్శలతో చంద్రబాబుకు గడికోట గడ్డిపెట్టారనే చెప్పాలి.