కువైట్ ఎంబసీ పునరావాస కేంద్రంలో చిక్కుకొన్న పశ్చిమగోదావరి జిల్లా మహిళలు తమ దీనావస్థపై సోషల్ మీడియాలో వీడియో వైరల్ చేసారు. బాధిత మహిళలు వీడియో పై సీఎం కార్యాలయం స్పందించింది. విడియో పై చర్యల తీసుకోవాలని డీజీపీని సీఎం ఆదేశించారు. డీజీపీ ఆదేశాలతో రంగంలోకి దిగిన దిశా స్పెషల్ ఆఫీసర్ దీపికా పాటిల్ , పశ్చిమ గోదావరి జిల్లా ఎస్పీ నవదీప్ సింగ్ లు బాధితుల కుటుంబసభ్యుల నుంచి వివరాల సేకరించారు. వెంటనే కువైట్ ఎంబసీతో సంప్రదింపులు జరిపి నలుగురు బాధిత మహిళలకు విముక్తి చేశారు. దీంతో వారిని కువైట్ నుంచి స్వగ్రామాలకు తీసుకొచ్చేందుకు చర్యలు తీసుకుంటున్నారు. సీఎంఓ స్పందనపై అందరూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. బాధిత మహిళల కుంబసభ్యులు ముఖ్యమంత్రికి కృతజ్ఞతలు తెలియజేసారు.
