టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడును చూస్తుంటే ‘మనిషికో మాట-గొడ్డుకో దెబ్బ’అనే సామెత గుర్తుకు వస్తుందని వైసీపీ ఎమ్మెల్యే గ్రంధి శ్రీనివాస్ విమర్శించారు. తాడేపల్లిలోని వైసీపీ పార్టీ కార్యాలయంలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ..ఇచ్చిన హామీలు అమలు చేయలేని చంద్రబాబును ప్రజలు 23 స్థానాలకే పరిమితం చేశారని విమర్శించారు. తన కొడుకు నారాలోకేష్ నే గెలిపించుకోలేకపోయిన బాబు దిగజారుడు మాటలు మాట్లాడుతున్నారన్నారు. అంతేగాక జనసేన అధినేత పవన్ కల్యాణ్ లాంటి వ్యక్తి రాజకీయాల్లోకి రావడం సిగ్గుచేటన్నారు. రాష్ట్రంలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలకు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ శ్రీకారం చుడుతున్నారని ఈ సందర్భంగా గ్రంధి తెలిపారు.
