ఇటీవల ఏపీలో సీఎం జగన్ అమ్మ ఒడి పథకాన్ని ప్రారంభించిన సంగతి తెలిసిందే..అమ్మఒడి పథకం కింద బడికి పిల్లలను పంపించే తల్లులకు ప్రతి ఏటా రూ. 15,000 ఆర్థిక సాయం ప్రభుత్వ అందించనుంది. సీఎం జగన్ ప్రవేశపెట్టిన ఈ పథకంపై దేశవ్యాప్తంగా ప్రశంసలు కురుస్తున్నాయి. అయితే ప్రతిపక్ష టీడీపీ మాత్రం అమ్మఒడిని కాస్తా ఆంక్షల ఒడిగా చేశారని గుడ్డిగా విమర్శలు చేస్తోంది. తాజాగా అమ్మ ఒడి పథకంపై నోబెల్ అవార్డు గ్రహీత జాన్ బి గుడెనఫ్ ప్రశంసల జల్లు కురిపించారు. భారత్ వంటి దేశంలో పిల్లలను చదువుకు పంపించే తల్లికి ఈ పథకం ఆర్థిక స్వావలంబన కలిగిస్తుందని ఆయన అన్నారు. నేర్చుకోవడం మనిషి విధి అనే ఈ నోబెల్ గ్రహీతకు ఇండియాలో పరిస్థితులు తెలియని కావు..మన దేశంలో నేర్చుకోవాలనే ఆసక్తి ఉన్నా ఎంతో మంది పిల్లలకు చదువు”కొనడానికి” డబ్బుల్లేక ఉన్నత చదవులకు దూరమవుతున్నారు. ఇప్పటికీ దేశంలో బాలకార్మిక వ్యవస్థ కొనసాగుతోంది. ఈ నేపథ్యంలో అమ్మ ఒడి వంటి పథకం నిరుపేద, మధ్యతరగతి కుటుంబాలకు ఎంతో కొంత మేలు చేసే అవకాశం ఉంది. ముఖ్యంగా అమ్మఒడి పథకాన్ని పరిశీలిస్తే.. తమ పిల్లలను ప్రైవేట్ స్కూళ్లల్లో చదివించే తల్లులకు ఫీజుల బాధ తొలగిస్తుంది..ఇక ప్రభుత్వం పాఠశాలల్లో పిల్లలను చదివించే తల్లులకు అయితే అమ్మఒడి ద్వారా అందే సాయం..ఏకంగా వారి పోషణకే ఉపయోగపడేలా సీఎం జగన్ ఈ పథకానికి రూపకల్పన చేశారు. అందుకే ఈ పథకాన్ని జర్మన్ నోబెల్ గ్రహీత జాన్ బి గుడెనఫ్ ప్రశంసిస్తూ..ఈ మేరకు ఒక వీడియో మెసేజ్‌ను కూడా విడుదల చేశారు. మొత్తంగా జర్మన్ నోబెల్ అవార్డు గ్రహీత ప్రశంసలతో అమ్మఒడిపథకంపై అడ్డగోలుగా విమర్శలు చేస్తున్న టీడీపీ నేతల నోర్లు మూతపడ్డట్లైంది.
