తమిళనాడులోని కోయంబత్తూరులో వైద్యులు ఓ బాలిక (13) కడుపులో నుంచి అరకిలో వెంట్రుకలు, షాంపూ సాచెట్లు తొలగించారు. ఏడో తరగతి చదువుతున్న బాలిక కొన్ని నెలలుగా తరచూ కడుపు నొప్పితో బాధపడుతున్నది. దీంతో తల్లిదండ్రులు ఆమెను వీజీఎం దవాఖానలో చేర్చారు. ఎండోస్కోపీతో పరీక్షించిన వైద్యులు.. ఆమె కడుపులో కొన్ని వస్తువుల ముద్ద ఉన్నట్టు తేల్చారు. డాక్టర్ గోకుల్ కృపాశంకర్ నేతృత్వంలో వైద్యులు ఆమెకు శస్త్రచికిత్సచేసి వెంట్రుకలు, ఖాళీ షాంపూ సాచెట్లు వెలికితీశారు. సమీప బంధువు చనిపోవడంతో ఆ బాలిక తీవ్ర మానసిక వేదనకు గురై వెంట్రుకలు, షాంపూ సాచెట్లను తినడం ప్రారంభించిందని కుటుంబసభ్యులు తెలిపారు.
Tags mental anguish sachets shampoo stomach tamilanadu
Related Articles
ముఖ్యమంత్రి కేజ్రీవాల్ సంచలన ఆరోపణలు
November 19, 2023