చైనా దేశాన్ని వణికిస్తున్న కరోనా వైరస్ ప్రపంచంలోని 10 దేశాలకు పాకింది. చైనా దేశంలో ప్రబలిన కరోనావైరస్ 2,744 మందికి సోకగా, వీరిలో 80 మంది మరణించారు. చైనాలో కరోనావైరస్ రోగుల సంఖ్యతో పాటు మృతుల సంఖ్య పెరుగుతుండటం అందరినీ ఆందోళనకు గురిచేస్తోంది. ఇక ఈ వైరస్ ఎలా వ్యాపిస్తుందో తెలుసుకుందాం..?
ఎలా వ్యాపిస్తుందంటే..?
* సాధారణంగా ఒక మనిషి నుండి మరో మనిషికి ఈ వైరస్ వ్యాపిస్తుంది.
* ఇది దగ్గు, తుమ్మినప్పుడు కూడా ఆ తుంపరల ద్వారా వ్యాపిస్తుంది.
* శారీరక సంబంధం ఉంటే ఈ వైరస్ వ్యాపిస్తుంది. అదే విధంగా స్పర్శ, షేక్ హ్యాండ్ వల్ల కూడా ఈ వ్యాధి వ్యాపిస్తుంది.
* వైరస్ కలిగిన పదార్థాన్ని ముట్టుకున్నా.. అనంతరం చేతులను శుభ్రం చేసుకోకుండా శరీర భాగాలను తాకినా వ్యాపిస్తుంది.
వైరస్ లక్షణాలు: జలుబు, తలనొప్పి, దగ్గు, మోకాలి నొప్పులు, జ్వరం
కరొనా వైరసీని ఎలా గుర్తించాలి?
రక్త పరీక్ష ద్వారా ఈ వైరస్ ని గుర్తించొచ్చు. కఫం, గొంతు శుభ్రపరుచు,ఇతర శ్వాస పరీక్షల ద్వారా వీటి ఆధారంగా వైరస్ ని గుర్తించొచ్చు..
వైరసీని నివారించవచ్చా..?
* ఎప్పటికప్పుడూ చేతులను సబ్బునీటితో కడగాలి.
* చేతలను కడగకుండా ముఖం, ముక్కు, నోటిని తాకొద్దు..
* అనారోగ్యంగా అనిపించినప్పుడు వెంటనే జాగ్రత్తలు తీసుకోవాలి.
* మీ పరిసరాలను ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంచుకోండి..