కరోనా వైరస్..ఎక్కడో చైనాలోని ఒక ప్రాంతంలో పెట్టిన ఈ వైరస్ ప్రస్తుతం చైనా తో పాటు సుమారు 10 దేశాల ప్రజలను వణికిస్తుంది. ఎప్పటికప్పుడు అధికారులు తగిన జాగ్రత్తలు తీసుకున్నప్పటికీ ఇంకా పూర్తిగా నివారించలేదు. ఇక అసలు విషయానికి వస్తే తాజాగా ఇది భారత దేశంలో కూడా ప్రవేశించినట్టు వార్తలు వినిపిస్తున్నాయి. తాజాగా వచ్చిన సమాచారం ప్రకారం చూసుకుంటే దేశ రాజధాని ఢిల్లీ లో ప్రవేశించినట్టు తెలుస్తుంది. వైరస్ సోకినట్లు అనుమానించడంతో ముగ్గురు వ్యక్తులను దేశ రాజధాని డాక్టర్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలోని ఐసోలేషన్ వార్డుకు తరలించారు. అంతేకాకుండా ఒక థాయిలాండ్ మహిళ , వైరస్ సోకినట్లు అనుమానించడంతో సోమవారం కోల్కతాలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో చేరిన తరువాత ప్రాణాలు కోల్పోయింది.