తండ్రి ఆశయాలు కొనసాగాలని పార్టీని పెట్టి తన తండ్రిని జనం గుండెల్లో అనుక్షణం బతికించుకుంటున్న వ్యక్తి ఒకరు. పిల్లనిచ్చి, చంద్రగిరిలో ఓడిపోతే రాజకీయంగా ఆశ్రయాన్ని ఇచ్చిన సొంత మామను వెన్నుపోటు పొడిచి పార్టీని లాక్కుంది…. కొడుకులు, కూతుళ్లు, తన తొడల్లుళ్ళ చేత మామ పై చెప్పులేయించి ఆత్మక్షోభకు గురిచేసి చంపింది…… తల్లి, తండ్రి ఇద్దరూ చావు ముంగిట ఉన్నా పట్టించుకోనిది, ఏనాడూ జన్మనిచ్చిన వారిని తలుచుకొనిది మరొకరు.
జగన్ తన తండ్రి పేరుతో పార్టీని పెట్టాడు, చనిపోయి పదేళ్లవుతున్నా సాక్షి పత్రికలో నేటికీ వైయస్ఆర్ బొమ్మ, సాక్షి టీవీలో 24 గంటలు వైయస్ఆర్ లోగో. అనుక్షణం మదిలో మెదిలే వైయస్ ఆశయాలతో అన్ని సంక్షేమ కార్యక్రమాలకూ వైయస్ఆర్ పేరే. వైయస్ఆర్ చనిపోయిన తర్వాత ఆగిపోయిన ఆరోగ్య శ్రీ, ఫీజు రీయింబర్స్ మెంట్ పథకాలకు పునరుజ్జీవం పోసాడు. విజయవాడ నడిబొడ్డున అపరభగీరథుని రూపంలో ఉన్న వైయస్ఆర్ నిండైన విగ్రహాన్ని చూడలేక బాబు కూల్చేయిస్తే.. అధికారంలోకి వచ్చిన 3 నెలల్లో విగ్రహాన్ని పునఃప్రతిష్ట చేసాడు.
ఇది తండ్రి పై జగన్ కు ఉన్న ఎమోషనల్ కనెక్ట్. చనిపోయిన తర్వాత కూడా వైయస్ఆర్ ఇంకా జనం గుండెల్లో బతికి ఉన్నాడంటే.. జగన్ లాంటి ఒక సమర్ధుడైన కొడుకు ఉండడం వల్లే. తండ్రి ఆశయాలను ముందుకు తీసుకువెళ్లాలని, తాను చనిపోయాక తండ్రి ఫోటో పక్కన తన ఫోటో కూడా జనం పెట్టుకునేలా పరిపాలన చేయాలనే బలమైన ఆకాంక్ష అతనిది.
తన నటనతో తెలుగువారిచే ఆరాధ్యుడిగా ఎన్టీఆర్ కీర్తింపబడ్డాడు, మూడు పర్యాయాలు ముఖ్యమంత్రిగా గెలిచాడు. అలాంటి ఎన్టీఆర్ కు తన 10 మంది సంతానం, అల్లుళ్లు, కూతుళ్లు, కొడుకులు ఏ గతి పట్టించారో, ఆఖరి రోజుల్లో కనీసం కూటికి గతిలేక ఎలాంటి చావును ఎన్టీఆర్ చూసాడో ప్రజలకు తెలియంది కాదు. కూతుళ్లు, కొడుకులు, కొడళ్లు, అల్లుళ్ల చేత తన్నులు తిని జీవిత చరమాంఖంలో నరకం అనుభవించింది ఎన్టీఆర్. అలాంటి మహానుభావుడికి ఆ గతి పట్టించింది నీచుడైన చంద్రబాబు. సొంత తమ్ముడిని గోలుసులతో కట్టేసి బాహ్య ప్రపంచానికి తెలియని నిజాలను దాచింది, తల్లి, తండ్రులను కనీసం మాటకైనా ఏనాడూ తలవని దౌర్భాగమైన కొడుకు చంద్రబాబు.