ఏపీ శాసనమండలి రద్దు విషయంలో అధికార వైసీపీ, ప్రతిపక్ష టీడీపీల మధ్య మాటల యుద్ధం కొనసాగుతోంది. వికేంద్రీకరణ బిల్లును చంద్రబాబు కుట్రపూరితంగా అడ్డుకున్నందుకే శాసనమండలి రద్దు చేయాల్సి వస్తుందని…వైసీపీ నేతలు అంటున్నారు. కాగా సీఎం జగన్‌మోహన్ రెడ్డి టీడీపీ ఎమ్మెల్సీలను ప్రలోభపెడుతున్నారని, మంత్రి బొత్స తమ పార్టీ ఎమ్మెల్సీలకు ఫోన్లు చేస్తున్నారని..చంద్రబాబు, లోకేష్‌లు తీవ్ర విమర్శలు చేస్తున్నారు.
అయితే తాజాగా చంద్రబాబు విమర్శలపై వైసీపీ ఎంపీ విజయసాయిరెడ్డి ట్విట్టర్ వేదికగా మండిపడ్డారు. అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్ట చెబుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని నిద్ర పోవడం లేదు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట..అంటూ చంద్రబాబు తీరును ఎండగట్టారు.
ఇక చంద్రబాబు కష్టాలు ఎల్లో మీడియాకు జీవన్మరణ సమస్యలై పోయాయి. కౌన్సిల్ రద్దుపై సిఎం జగన్ గారి ప్రకటన వచ్చినప్పటి నుంచి తెలుగుదేశం ఎమ్మెల్సీల కదలికలపై కుల మీడియా నిఘా పెట్టింది. ఇళ్ల చుట్టూ తమ ప్రతినిధులను మోహరించి బాబుకు ఎప్పటికప్పుడు సమాచారం అందిస్తోంది అంటూ విజయసాయిరెడ్డి సంచలన ట్వీట్ చేశారు.
సీఎం జగన్ గారు విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయింది. అదే గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారే. మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా పంపించి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేవాడు అంటూ చంద్రబాబు నైజాన్ని బయటపెడుతూ విజయిసాయిరెడ్డి మరో ట్వీట్ చేశారు. మొత్తంగా ఏపీ శాసనమండలి రద్దు విషయంలో సీఎం జగన్‌పై చేస్తున్న విమర్శలకు ధీటైన కౌంటర్ ఇచ్చారు విజయసాయిరెడ్డి..ప్రస్తుతం ఈ ట్వీట్స్ సోషల్ మీడియాలో వైరల్‌గా మారాయి.