ఏపీ శాసనమండలిని రద్దు చేస్తూ సీఎం జగన్ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. సభలో కౌన్సిల్ రద్దుపై చర్చ జరిపిన అనంతరం…తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపించనుంది ప్రభుత్వం. కాగా శాసనమండలి రద్దును టీడీపీ అధినేత చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు..శాసనమండలి రద్దు చేస్తారా…ఎవడిచ్చారు మీకు అధికారం..ఎలా రద్దు చేస్తారో చూస్తా అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేస్తున్నారు. అయితే ఇదే శాసనమండలిని గతంలో టీడీపీ ప్రభుత్వంలో స్వర్గీయ ఎన్టీఆర్ రద్దు చేసినప్పుడు చంద్రబాబు పక్కనే ఉన్నాడు. అయితే టీడీపీ హయాంలో రద్దు అయిన శాసనమండలిని దివంగత ముఖ్యమంత్రి వైయస్ పునరుద్దరించారు. ఆ సమయంలో ఇదే చంద్రబాబు శాసనమండలి వల్ల ఉపయోగం లేదని..ప్రజాధనం వేస్ట్ అని…వైయస్ తన అనుచరులకు పదవులు ఇవ్వడం కోసమే మండలిని పునరుద్ధరిస్తున్నారని…తీవ్ర విమర‌్శలు చేశారు. కాగా ఇప్పుడు వైయస్ తనయుడు జగన్ మోహన్ రెడ్డి శాసనమండలిని రద్దు చేస్తుంటే చంద్రబాబు యూటర్న్ తీసుకుని శాసనమండలి ఉండాల్సిందే అంటూ రంకెలు వేస్తున్నారు.
తాజాగా చంద్రబాబు రెండు నాల్కల ధోరణిని వైయస్ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి తీవ్రంగా ఎండగట్టారు. ఈ సందర్భంగా శాసన మండలిని పునరుద్దరించకుండా…అడ్డుకుంటూ చంద్రబాబు మాట్లాడిన మాటలను చెవిరెడ్డి యాజీటీజ్ బయటపెట్టారు. ఆ రోజు 2004లో శాసనమండలి రద్దును సమర్థిస్తూ చంద్రబాబు అసెంబ్లీలో మాట్లాడిన మాటలు ఇవే… ‘‘అధ్యక్షా, ఏదైతే ఈరోజు శాసనమండలి తేవడం పట్ల దీనిని వ్యతిరేకిస్తున్నాను. ఇప్పుడు కూడా తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షం ద్వారా ప్రజల ప్రయోజనాలకు ఎక్కువ ప్రాధాన్యత ఇస్తున్నాము. మంచిపనులు చేస్తే తప్పకుండా సహకరించేవారము. అదే విధంగా ప్రజల పైన భారం పడే చర్యలు ప్రభుత్వం ప్రధాన నిర్ణయాలు తీసుకున్నప్పుడు తప్పనిసరిగా వ్యతిరేకించాల్సిన అవసరం ఉంది. ఈ విషయం అనేకసార్లు చెప్పాము. మళ్లీ ఒకసారి రీయిటరేట్ చేస్తున్నాము. విధాన మండలికి చాలామంది చాలా గట్టిగా సపోర్ట్ చేస్తున్నారు. ఈ నిర్ణయం వలన వారి (వైయస్) మనుషులకు మళ్లీ పదవులు వస్తాయి తప్ప రాష్ట్రప్రజలకు లాభం లేదు. మీరే చూడబోతున్నారు. ఈ రోజు శాసనమండలి ఒకసారి చూస్తే, కార్యకర్తలు కొంతమందికి, నాయకులు కొంతమందికి రాజకీయంగా పునరావాసం కల్పిస్తారు తప్ప దీనివలన బ్రహ్మాండంగా శాసనాలు వస్తాయి, రాష్ట్రానికి ప్రయోజనం కలుగుతుంది అనేది వాస్తవం కాదని తెలియజేస్తున్నాను. అందుకే మనం ఒకసారి ఆలోచించుకుఉంటే ఏ విధంగా ఇవన్నీ జరిగాయో, దేశంలో గానీ, ప్రపంచంలోగానీ ఒకసారి ఎనలైజ్ చేసుకోవాల్సిన అవసరం ఉంది’’…ఇలా చంద్రబాబు మాట్లాడిన మాటలను స్వయంగా చెవిరెడ్డి చదివి వినిపించారు.
శాసన మండలి వల్ల రూ. 20 కోట్లు ఆర్థిక భారం పడుతుందని.. రాజకీయ ప్రయోజనాల కోసమే మండలిని… రాజకీయ పునరావాస కేంద్రంగా వాడుకుంటున్నారంటూ బాబు గతంలో వ్యాఖ్యలు చేశారని చెవిరెడ్డి గుర్తు చేశారు. ఆరోజు చంద్రబాబు కోరుకున్న మాటను తాము ఈరోజు అమలు చేస్తున్నామని వ్యాఖ్యానించారు. ‘మీరు కోరుకున్నది నిజమవుతుంటే స్వాగతించకుండా ఎందుకు దాక్కుంటున్నారు. మీకు అనుకూలంగా ఉంటే ఒకవిధంగా.. వ్యతిరేకమైతే మరో విధంగా మాట్లాడుతారా’ అని చంద్రబాబును ప్రశ్నించారు. చంద్రబాబుకు దమ్ము, ధైర్యం ఉంటే.. మండలి ఉపయోగంపై శాసనసభలో చర్చకు రావాలని సవాల్ విసిరారు. మొత్తంగా గతంలో శాసన మండలి రద్దుపై చంద్రబాబు చేసిన వ్యాఖ‌్యలను చూసి..చెవిరెడ్డి మా బాబుగారిని భలే ఇరికించాడుగా అని..తెలుగు తమ్ముళ్లు తలలు పట్టుకుంటున్నారు.