తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ 9 కార్పోరేషన్ల సొంతం చేసుకుంది. మొత్తం తొమ్మిది కార్పొరేషన్లలో మేయర్ల ఎన్నిక ఈరోజు సోమవారం పూర్తి అయింది. దీంతో మేయర్, డిప్యూటీ మేయర్ల ఎన్నిక ప్రక్రియ పూర్తయింది. టీఆర్ఎస్ సొంతం చేసుకున్న మేయర్ల జాబితా ఇలా ఉంది.
1. రామగుండం – బంగి అనిల్ కుమార్(మేయర్)
2. నిజాంపేట – కొలను నీలా రెడ్డి(మేయర్)
3. పీర్జాదిగూడ – జక్కా వెంకట్ రెడ్డి(మేయర్)
4. మీర్‌పేట – ముడవత్ దుర్గ(మేయర్)
5. బడంగ్‌పేట – పారిజాత(మేయర్)
6. జవహర్ నగర్ – మేకల కావ్య(మేయర్)
7. బండ్లగూడ జాగీర్ – మహేందర్ గౌడ్(మేయర్)
8. నిజామాబాద్ – దండు నీతూ కిరణ్(మేయర్)
9. బొడుప్పల్ – సామల బుచ్చిరెడ్డి(మేయర్)