తెలంగాణ రాష్ట్రంలో విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ ప్రభంజనం సృష్టించిన సంగతి విదితమే. టీఆర్‌ఎస్ పార్టీ 9 కార్పోరేషన్లు, 110 మున్సిపాలిటీలను కైవసం చేసుకుంది. ఈ క్రమంలో నిజామాబాద్ మున్సిపాలిటీపై గులాబీ జెండా ఎగిరింది. మున్సిపల్ ఎన్నికల్లో మొత్తం ఇరవై ఎనిమిది స్థానాలతో అతిపెద్ద పార్టీగా బీజేపీ అవతరించిన సంగతి కూడా తెల్సిందే. టీఆర్ఎస్ పార్టీ పదమూడు,ఎంఐఎం పదహారు చోట్ల ,కాంగ్రెస్ రెండు,స్వతంత్రులు ఒక చోట విజయదుందుభి మ్రోగించింది. అయితే మ్యాజిక్ ఫిగర్ ముప్పై నాలుగు సీట్లు లేకపోవడంతో బీజేపీ ప్రతిపక్షంలోకి వెళ్లింది. ఎంఐఎం,ఎక్స్ అఫీసియో సభ్యులతో కలిపి టీఆర్ఎస్ మేయరు స్థానాన్ని దక్కించుకుంది. దీంతో నిజామాబాద్ మున్సిపాలిటీ పీఠంపై గులాబీ జెండా రెపరెపలాడింది.