సరిలేరు నీకెవ్వరు మూవీతో మంచి జోష్ లో ఉన్న భామ రష్మిక మంధాన. ఈ మూవీలో ఒక పక్క చక్కని అభినయంతో కామెడీని పంచుతూనే మరోవైపు తన అందాలను ఆరబోసింది.
అయితే ఈ మూవీ తర్వాత రష్మిక జూనియర్ ఎన్టీఆర్ తో రోమాన్స్ చేయనున్నది అని ఫిల్మ్ నగర్లో వార్తలు వినిపిస్తున్నాయి. త్రివిక్రమ్ శ్రీనివాస్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ మూవీలో ఈ ముద్దుగుమ్మ పేరును ఖరారు చేసినట్లు వార్తలు తెలుగు సినిమా ఇండస్ట్రీలో చక్కర్లు కొడుతున్నాయి.
త్రివిక్రమ్ ప్రొడక్షన్ యూనిట్ నుండి అధికారక ప్రకటన వచ్చేవరకు ఇది కేవలం వార్తనే.. క్లారిటీ వచ్చాక ఇది కన్ఫామ్.