భారత రంజీ ప్లేయర్ యంగ్ అండ్ డైనమిక్ సర్ఫరాజ్ ఖాన్ ధర్మశాల వేదికగా మరో మార్క్ సాధించాడు. ఈ 22ఏళ్ల కుర్రాడు ముంబై తరపున ఆడుతున్నాడు. ఇందులో భాగంగా మొన్న ఉత్తరప్రదేశ్ తో జరిగిన మ్యాచ్ లో ఏకంగా ట్రిపుల్ సెంచరీ సాధించాడు. నేడు హిమాచల్‌ప్రదేశ్ తో డబుల్ సాధించి నాటౌట్ గా నిలిచాడు. ఒక ఎండ్ లో ముంబై 16/3 తో పీకల్లోతు కష్టాల్లో పడింది. అయినప్పటికీ బయపడకుండా ఆడుతూ 199 బంతుల్లో ఈ ఫీట్ సాధించాడు. ఇందులో 32ఫోర్లు, 4సిక్స్ లు ఉన్నాయి. ఇదంతా చూస్తుంటే ఇండియాకు మరో ఆయుధం దొరికిందని చెప్పాలి. మరి రానున్న రోజుల్లో ఇంకెన్ని ఫీట్స్ సాదిస్తాడో ఇంకా తెలియాల్సి ఉంది.
