సూర్యాపేట మున్సిపల్ చైర్మన్ ఎన్నికలో మంత్రి జగదీష్ రెడ్డి గారు తన మార్కు చూపించాడు. లక్షలు, కోట్లు దారపొసే సత్తా ఉన్న నాయకులను పక్కకు పెట్టి జనరల్ స్థానంలో ఒక దళిత మహిళను చైర్ పర్సన్ గా ఎన్నుకున్నారు. ఎన్నికల ఫలితాలు ముగిసిన్నప్పటి నుండి చైర్ పర్సన్ ఆశవహులు ఎన్నో రకాల ప్రయత్నాలు మొదలు పెట్టారు.
అవన్నీ సావధానంగా వింటూనే తన నిర్ణయాన్ని అత్యంత గోప్యత పాటిస్తూ చైర్ పర్సన్ అభ్యర్థిని అన్నపూర్ణ ను ప్రకటించారు. ఎన్నిక విషయం తెలియక పోవడంతో కౌన్సెలర్ అయితే చాలు అనుకున్న అన్నపూర్ణ ఆనందంతో కన్నీరు కారుస్తూ మంత్రికి కృతజ్ఞతలు తెలిపింది.
అన్నపూర్ణ మొదటి నుండి మంత్రి జగదీష్ వెంట ఉండి నేటి వరకు ఆయన బాటలో వెను దిరగకుండా నడిచింది. ఈ ఒక్క నిర్ణయం చాలు మంత్రి గారు సూర్యాపేట పట్టణాన్ని తీర్చి దిద్దటం తో పాటు రాజకీయ ప్రక్షాళన చేసేందుకు కంకణం కట్టుకున్నాడనీ తెలపడానికి…. అందుకే సూర్యాపేట ప్రజలు దటీజ్ జగదీష్ రెడ్డి అంటూ అభినందిస్తున్నారు.