ఏపీ ముఖ్యమంత్రి ,అధికార వైసీపీ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి నాయకత్వంలోని క్యాబినెట్ ఏపీలో శాసనమండలి రద్దు బిల్లును ఆమోదించిన సంగతి విదితమే. ఈ బిల్లును కేంద్ర ప్రభుత్వం ఆమోదించి పార్లమెంట్లో బిల్లు పాసు కావాల్సి ఉంది. అయితే ఇప్పటి వరకు మండలి రద్ధు అయిన రాష్ట్రాలు ఏంటో ఒకసారి తెలుసుకుందామా..?.
అస్సాం , మధ్యప్రదేశ్ , పంజాబ్ , తమిళనాడు ,పశ్చిమ బెంగాల్ లతో పాటుగా ఆర్టికల్ 370రద్ధుతో జమ్మూ కాశ్మీర్లో కూడా శాసనమండలి రద్ధు అయింది. మరోవైపు ఢిల్లీ,హిమాచల్ ప్రదేశ్,ఒడిశా,రాజస్థాన్,ఉత్తరాఖండ్ లోనూ ముందు నుండి మండలి ఏర్పాటు కాలేదు.
అయితే ఒకప్పటి అవిభాజ్య ఏపీలో 1985 ఏప్రిల్ 30న దివంగత మాజీ ముఖ్యమంత్రి,టీడీపీ వ్యవస్థాపక అధ్యక్షుడు మండలిని రద్ధు చేశాడు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం మండలిని పునరుద్ధరించింది.