చంద్రబాబు అధికారంలో ఉన్నంతసేపు ఎగిరెగిరి పడ్డారు. ఇప్పుడు అధికారం కోల్పోయినాక సైలెంట్ గా ఉంటూ ప్రజలను మంచి జరుగుతుంటే చూస్తూ ఉండకుండా పైపైకి లేస్తున్నారు. ఎదో అధికారం ఆయనకు సొంత హక్కు అన్నట్టుగా వ్యవహరిస్తున్నారు. పదవి లేకపోవడంతో కొట్టిమిట్టలాడుతున్నారు. ఏవేవో విశ్వ ప్రయత్నాలు చేస్తూ చివరికి అవన్నీ తుస్సుమనడంతో ఏమీ అర్డంకావడం లేదు. ఇప్పుడు కూడా ప్రజలు సరైన బుద్ధి చెప్పినప్పటికీ ఏమీ మారలేదు. దీనిపై ఘాటుగా స్పందించిన విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా “అధికారంలో ఉన్నప్పుడు మా పార్టీ ఎమ్మెల్యేలను, ఎంపీలను సంతలో పశువుల్లా కొన్నాడు. ఇప్పుడు సొంత పార్టీ ఎమ్మెల్సీలకు డబ్బు ముట్ట చెబుతున్నాడు. ఎమ్మెల్సీలు ఎక్కడ ధిక్కరిస్తారో అని నిద్ర పోవడం లేదు. వారి పదవీకాలం ముగిసేంత వరకు జీత భత్యాల కింద ఎంత వస్తుందో అంత చెల్లిస్తాడట!” అని అన్నారు. ఇక మరో ట్వీట్ లో సీఎం జగన్ గారు విలువలకు కట్టుబడిన మొండి మనిషి కాబట్టి సరిపోయింది. గేట్లు తెరిచుంటే ఈ పాటికి అంతా జంప్ అయ్యేవారే. మంత్రి పదవి ఆఫర్ చేస్తే ఆఖరికి మాలోకాన్ని కూడా పంపించి కేసుల నుంచి తప్పించుకోవాలని చూసేవాడు చంద్రబాబు అని అన్నారు.