నవ్యాంధ్రప్రదేశ్ రాజకీయాల్లో అతిపెద్ద సంచలనం చోటు చేసుకుంది. ఏపీ అసెంబ్లీలో రాష్ట్ర శాసనమండలి రద్దు తీర్మానాన్ని స్వయంగా సీఎం జగన్ ప్రవేశపెట్టారు. తొలుత కేబినెట్‌లో సమావేశంలో శాసనమండలి రద్దు నిర్ణయంపై ఆమోద ముద్ర వేసిన అనంతరం…స్పీకర్ తమ్మినేని సీతారాం బీఏసీ కమిటీని సమావేశపరిచారు. అయితే ఈ బీఏసీ సమావేశానికి ప్రతిపక్ష టీడీపీ నాయకులు హాజరు కాలేదు. బీఏసీ నిర్ణయం మేరకు అసెంబ్లీ సమావేశం కాగానే సీఎం జగన్ శాసనమండలి రద్దు తీర్మానాన్ని సభలో ప్రవేశపెట్టారు. సీఎం ప్రతిపాదించిన తీర్మానంపై సభ చర్చ చేపట్టింది.
కాగా శాసనమండలిలో ఉన్న మెజారిటీతో టీడీపీ అధ్యక్షుడు చంద్రబాబు కుట్రపూరితంగా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకున్న సంగతి తెలిసిందే..స్వయంగా చంద్రబాబు శాసనమండలి గ్యాలరీలో కూర్చుని.. స్పీకర్ షరీఫ్‌ను ప్రభావితం చేసి.. నిబంధనలకు వ్యతిరేకంగా వికేంద్రీకరణ, సీఆర్‌డీఏ బిల్లులను సెలెక్ట్ కమిటీకి పంపించారు. గతంలో కూడా ఇంగ్లీష్ మీడియం, ఎస్టీ ఎస్టీ కమీషన్ బిల్లులను టీడీపీ మండలిలో అడ్డుకుంది. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన సీఎం జగన్ ప్రజల మేలు కోసం ఉపయోగపడే బిల్లులను అడ్డుకుంటున్న శాసన మండలిని ఏకంగా రద్దు చేస్తూ అసెంబ్లీలో తీర్మానం ప్రవేశపెట్టారు. ఈ రోజు అసెంబ్లీలో చర్చ అనంతరం మండలి రద్దు తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి పంపుతారు. మొత్తంగా చంద్రబాబు కుటిల రాజకీయాల వల్ల ఏకంగా పెద్దల సభ రద్దు అయ్యే పరిస్థితి వచ్చింది.