ఏపీ శాసనమండలి రద్దుపై అసెంబ్లీలో సీఎం జగన్ తీర్మానం ప్రతిపాదించారు. ఈ తీర్మానంపై సభలో చర్చ జరిగింది. అయితే ఈ రోజు అసెంబ్లీకి చంద్రబాబుతో సహా టీడీపీ ఎమ్మెల్యేలంతా డుమ్మా కొట్టారు. దీనికి కారణం శాసనమండలి గురించి శాసనసభలో చర్చ జరగడం మాకిష్టం లేదు…అందుకే మేం రావడం లేదని టీడీపీ నేతలు ప్రకటించారు..అనుకుల మీడియా గొట్టాల ముందు కౌన్సిల్ రద్దుపై రంకెలు వేశారు. అయితే చంద్రబాబు డుమ్మాకొట్టడానికి అసలు కారణం అసెంబ్లీలో బయటపడింది. వికేంద్రీకరణ బిల్లు విషయంలో చంద్రబాబు శాసనమండలిని అడ్డుపెట్టుకుని చేసిన కుట్రతో ప్రభుత్వం సీరియస్ అయింది..అది చివరకు మండలి రద్దు చేసేంతవరకు దారి తీసింది. అయితే చంద్రబాబు మాత్రం పెద్దల సభను రద్దు చేసే అవకాశం మీకెవడిచ్చాడు..ఎలా రద్దు చేస్తారో చూస్తా…అంత ఆషామాషీ కాదు..అంటూ బెదిరింపులు మొదలుపెట్టాడు. దీంతో చిర్రెత్తిన జగన్ చంద్రబాబును అసెంబ్లీ వేదికగా ఏకిపారేయడానికి, బాబు నిజస్వరూపాన్ని ప్రజల ముందు బట్టబయలు చేయడానికి ప్రిపేర్ అయి వచ్చాడు…ఆ క్రమంలోనే శాసనసభలో చర్చ సందర్భంగా గతంలో చంద్రబాబు మండలి రద్దుపై మాట్లాడిన వీడియో క్యాసెట్‌ను ప్లే చేశారు. ఇంకే ముంది చంద్రబాబు బండారమంతా బట్టబయలైపోయింది.
వైయస్ హయాంలో శాసనమండలిని పునరుద్దరించినప్పుడు ఆ నాడు అసెంబ్లీలో చంద్రబాబు మాట్లాడుతూ.. తన అనుచరులకు పదవులు ఇవ్వడానికే మండలి మళ్లీ పునరుద్ధరిస్తున్నారు..అసలు మండలి వల్ల 20 కోట్ల ప్రజాధనం వేస్ట్ అవుతుందంటూ వీరావేశంతో వూగిపోయాడు. అంతే కాదు అప్పట్లో నిరక్షరాస్యులు, విద్యావంతులు తక్కువగా అసెంబ్లీకి వచ్చారు కాబట్టే మండలి ఏర్పాటు చేశారని..ఇప్పుడు అసెంబ్లీకి అంతా పట్టభద్రులే వస్తున్నారు కాబట్టి శాసనమండలి అవసరం లేదంటూ లెక్చరిచ్చాడు..ఇప్పుడు మాత్రం ప్రభుత్వం దుర్మార్గంగా శాసనమండలిని రద్దు చేస్తుందంటూ గగ్గోలు పెడుతున్నాడు. అందుకే తన మాటలను అసెంబ్లీలో నాడు నేడు అంటూ క్యాసెట్ వేసి మరీ మరోసారి ప్రజల ముందు తన బండారం బయటపెడతారనే భయంతోనే చంద్రబాబు డుమ్మా కొట్టినట్లు తెలుస్తోంది. ఇవాళ అసెంబ్లీలో ప్లే చేసిన వీడియో చంద్రబాబు యూటర్న్ అంకుల్ అనే విషయాన్ని మరోసారి నిరూపించింది. శాసనమండలి రద్దు వంటి కీలక తీర్మానంపై చర్చకు చంద్రబాబు హాజరై ఉంటే..వైసీపీ నేతల చేతిలో కచ్చితంగా చాకిరేవు ఉండేది..అందుకే తెలివిగా సభకు డుమ్మాకొట్టి…తప్పించుకున్నారు. ఇన్ని రోజులు శాసనమండలి రద్దుపై ప్రభుత్వంపై తొడ గొట్టిన చంద్రబాబు ఆఖరకు కీలక సమయంలో తప్పించుకున్నా..వీడియో సాక్షిగా ప్రజల ముందు పరువు పోగొట్టుకున్నారు.