తెలంగాణ రాష్ట్ర ఐటీ,పరిశ్రమల మరియు మున్సిపల్ శాఖ మంత్రి కేటీ రామారావు జాతీయ పార్టీలైన కాంగ్రెస్,బీజేపీపై నిప్పులు చెరిగారు. ఈ రోజు తెలంగాణ భవన్ లో మంత్రి కేటీఆర్ మాట్లాడుతూ”బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు కుమ్మక్కు అయ్యాయి. పేరుకు ఢిల్లీ పార్టీలు చేసేవన్ని పనికిమాలిన పనులు అని ధ్వజమెత్తారు.
మేడ్చల్, నేరేడుచర్లలోనూ టీఆర్ఎస్సే గెలుస్తుందన్నారు. 10 కార్పొరేషన్లలోనూ తామే గెలుస్తున్నాం. కాంగ్రెస్కు 4, బీజేపీ 2, ఎంఐఎంకు 2 మున్సిపాలిటీలు మాత్రమే వచ్చాయని అన్నారు.తెలంగాణలో పట్టణీకరణ చాలా వేగంగా జరుగుతుంది. 43 శాతం జనాభా పట్టణ ప్రాంతాల్లో ఉంటున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తు.చ. తప్పకుండా అమలు చేస్తాం. ఇంత పెద్ద మెజార్టీని ఇచ్చినందుకు ఇచ్చిన ప్రతి వాగ్దానాన్ని అమలు చేసి తీరుతాం అని తేల్చి చెప్పారు.