నూతనంగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీ చైర్మన్ గా 6వ వార్డు కౌన్సిలర్ ఆంగోత్ అరుణ, వైస్ చైర్మన్ గా 11వ వార్డు కౌన్సిలర్ కోమాండ్ల ఎలేందర్ రెడ్డి ఎన్నికయ్యారు. ఈ సంధర్బంగా ఆర్డీవో మహేందర్ జీ చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లతో ప్రమాణస్వీకారం చేయించారు. అనంతరం చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లు పంచాయితీ రాజ్ శాఖ మంత్రి శ్రీ ఎర్రబెల్లి దయాకర్ రావు గారుని, ఎమ్మెల్యే అరూరి రమేష్ గారిని మర్యాదపూర్వకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు.
మంత్రి దయాకర్ రావు గారు, ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు వర్ధన్నపేట మున్సిపాలిటీ నూతన పాలకవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు మాట్లాడుతూ నూతనంగా ఏర్పాటైన వర్ధన్నపేట మున్సిపాలిటీ అభివృద్ధికి నూతన పాలక వర్గం కలిసి కట్టుగా పనిచేయాలని సూచించారు.
ప్రజల నమ్మకాన్ని నిలబెట్టుకునే విధంగా అవినీతి రహిత పాలన అందించాలని తెలిపారు. ప్రజలకు జవాబుదారిగా ఉంటూ వర్ధన్నపేట పట్టణాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలనీ అన్నారు. ఈ సంధర్బంగా చైర్మన్, వైస్ చైర్మన్, కౌన్సిలర్లను ఎమ్మెల్యే అరూరి రమేష్ గారు శాలువాలతో సత్కరించారు.
Post Views: 305