టీమిండియా న్యూజిలాండ్ గడ్డపై అడుగుపెట్టే ముందువరకు కూడా గెలవగలమా అనే అనుమానాలతోనే ఉన్నారంతా కాని ఇప్పుడు చూస్కుంటే బ్లాక్ కాప్స్ కనీసం ఒక్క మ్యాచ్ అయిన గెలుస్తుందా అనే డౌట్. టీ20 సిరీస్ లో భాగంగా మొత్తం 5మ్యాచ్ లలో రెండు మ్యాచ్ లు అవ్వగా అది ఇండియానే గెలుచుకుంది. ఇక ఈ విజయంలో కీలక పాత్ర పోషించింది రాహుల్ నే. తన ఆటతో అందరి మన్నలను పొందుతున్నాడు. ఇంక వన్డేల్లో అయితే ఏ స్థానంలో ఐనా తనదైన శైలిలో రాణిస్తున్నాడు. టీ20లో వరుసగా రెండు మ్యాచ్ లలో అర్ధ శతకాలు సాధించాడు. తద్వారా టీ20 మ్యాచ్ లో రెండు అర్ద శతకాలు సాధించిన మొదటి కీపర్ గా ధోని సరసన నిలిచాడు. కాని ధోని వరుసగా చెయ్యలేదు. ఇదంతా చూస్తుంటే పంత్ కి ఇక కష్టమే అని చెప్పాలి.