ఇది నిజం. తనకు జన్మనిచ్చిన తల్లి కౌన్సిలర్ .. తను ఎమ్మెల్యే అయిన సంఘటన తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల్లో చోటు చేసుకుంది.
శనివారం విడుదలైన మున్సిపల్ ఎన్నికల ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీకి చెందిన చెన్నూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన శాసనసభ్యుడు బాల్క సుమన్ తల్లి బాల్క ముత్తమ్మ గెలుపొందారు.
జగిత్యాల జిల్లా మెట్ పల్లి మున్సిపాలిటీ ఎన్నికల్లో ఎమ్మెల్యే సుమన్ తల్లి పదమూడో వార్డు నుండి టీఆర్ఎస్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. ఈ ఎన్నికల్లో తన సమీప ప్రత్యర్థిపై రెండు వందల తొంబై నాలుగు ఓట్ల తేడాతో విజయం సాధించారు.