అసెంబ్లీ ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు నెరవేర్చాల్సి ఉందని సీఎం కేసీఆర్ తెలిపారు. మున్సిపాలిటీ ఎన్నికల ఫలితాలపై సీఎం కేసీఆర్ తెలంగాణ భవన్‌లో మీడియాతో మాట్లాడారు. అసెంబ్లీ ఎన్నికల్లో ఇచ్చిన హామీ మేరకు ఈ ఏడాది మార్చి 31వ తేదీ నుంచి 57 ఏళ్లు దాటిన అందరికీ వృద్ధాప్య పింఛను ఇస్తామని ఆయన స్పష్టం చేశారు.
ప్రభుత్వ ఉద్యోగులకు వయోపరిమితి కూడా పెంచుతామని సీఎం చెప్పారు. పీఆర్‌సీ పెంపుపై కూడా త్వరలో చర్చలు జరుపుతామని సీఎం పేర్కొన్నారు. త్వరలోనే మంత్రివర్గ సమావేశం ఏర్పాటు చేసి ఈ విషయాలపై నిర్ణయం తీసుకుంటామన్నారు.కేంద్రం నుంచి రాష్ర్టానికి రావాల్సిన నిధులు రావడం లేదన్నారు. తెలంగాణకు 5వేల కోట్ల బకాయిలు కేంద్రం నుంచి రావాలి. ఇంకా 1131 కోట్లు జిఎస్టీ కింద రావాల్సి ఉంది.
జీడీపీ మూడు, నాలుగు కాదు సున్నా ఉందని కొందరు అంటున్నారు. దేశ పరిస్థితి ఎలా ఉన్నప్పటికీ జీఎస్‌డీపీ మాత్రం పెరుగుతోందన్నారు సీఎం. దేశ ఆర్థిక వ్యవస్థ ఇంకా దిగజారుతుందని ఆర్థికవేత్తలు హెచ్చరిస్తున్నారు అని కేసీఆర్ తెలిపారు. తెలంగాణ రాష్ట్రం ఆరోగ్య సూచికను తెలిపే కార్యక్రమం త్వరలోనే చేపడుతామన్నారు.
Tags asara kcr ktr slider telangana cm telangana muncipal election telangana muncipal elections results telanganacmo trs governament