టాలీవుడ్ ఇండస్ట్రీకి చెందిన సీనియర్ దర్శకుడు,మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ శ్రీనివాస్ నేతృత్వంలో యంగ్ టైగర్ ,స్టార్ హీరో జూనియర్ ఎన్టీఆర్ నటించబోయే సరికొత్త మూవీకి పేరు ఫిక్స్ అయిందని సోషల్ మీడియా,ఫిల్మ్ నగర్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి.
త్రివిక్రమ్ శ్రీనివాస్ ,జూనియర్ కాంబినేషన్లో గతంలో విడుదలైన అరవింద సమేత మంచి విజయం సాధించడంతో తాజా ఈ మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి.
త్రివిక్రమ్ ,జూనియర్ ఎన్టీఆర్ కాంబినేషన్లో తెరకెక్కనున్న మూవీ ఆగస్టులో సెట్స్ పైకి వెళ్లనున్నది. ఈ చిత్రానికి అయినను పోయిరావలే హస్తినకు అనే టైటిల్ ఫిక్స్ అయినట్లు సమాచారం. అయితే ఇది ఎంతవరకు నిజమో చిత్రం యూనిట్ చెప్పాల్సి ఉంది.