తెలంగాణ రాష్ట్ర మున్సిపల్ ఎన్నికల ఫలితాలు శనివారం నాడు వెలువడిన సంగతి విదితమే. ఈ ఫలితాల్లో అధికార టీఆర్ఎస్ పార్టీ 111,కాంగ్రెస్ పార్టీ 03,బీజేపీ 02,ఎంఐఎం02 మున్సిపాలిటీల్లో విజయకేతనం ఎగురవేసింది. మిగిలిన రెండు చోట్ల ఫలితాలు ఇంకా వెలువడలేదు.
అయితే ఈ ఎన్నికల్లో రాష్ట్రంలో రాజన్న సిరిసిల్ల జిల్లాలోని సిరిసిల్ల మున్సిపాలిటీలో పోటి చేసిన కాంగ్రెస్ అభ్యర్థికి ఒక్క ఓటు కూడా పడలేదు. అఖరికీ ఆ అభ్యర్థికి చెందిన కుటుంబం కూడా ఓటు వేయకపోవడం గమనార్హం.
సిరిసిల్ల మున్సిపాలిటీలో పదిహేడో వార్డు నుండి కాంగ్రెస్ అధిష్టానం అదేశాల మేరకు తొమ్మిదో వార్డుకు చెందిన నాగరాణి పోటి చేసింది. అయితే ఆమెకు కనీసం ఒక్క ఓటు కూడా పడలేదు. అఖరికీ తన కుటుంబ సభ్యులు కూడా ఓటు వేయకపోవడంతో కంగుతినడం ఆమె వంతైంది.