టీడీపీ అదినేత చంద్రబాబు నాయుడు అద్యక్షతన జరిగిన టిడిఎల్పి సమావేశానికి ఆరుగురు ఎమ్మెల్సీలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశం అయింది. వీరు వ్యక్తిగత పనుల మీద రాలేదా? లేక పార్టీపై అసమ్మతితో రాలేదా అన్నది తెలియవలసి ఉంది. అయితే కీలకమైన సమావేశానికి రాకపోవడం అందరి దృష్టిని ఆకర్షించింది. ఇప్పటికే ముగ్గురు ఎమ్మెల్సీలు పార్టీకి దూరం అయిన సంగతి తెలిసిందే. గాలి సరస్వతి, కేఈ ప్రభాకర్, తిప్పేస్వామి, శత్రుచర్ల విజయరామరాజు, ఏఎస్ రామకృష్ణ, శమంతకమణి ఈ రోజు సమావశానికి దూరంగా ఉన్నారు. పార్టీ అధినేతకు కనీస సమాచారం లేకుండా గైర్హాజరు కావడంతో ఈ పరిణామం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది.శాసనమండలి రద్దు అవుతుందన్న ఆందోళనలో ఉన్న టీడీపీ ఎమ్మెల్సీల్ని బుజ్జగించేందుకు చంద్రబాబు రెండ్రోజులుగా ఎడతెగని ప్రయత్నాలు చేస్తున్నారు. అయినా కొందరు పార్టీ భేటీ కి రాలేదు.
