ఏపీ రాజధాని విషయంలో టీడీపీ తమ మాటను నెగ్గించుకోవడానికి విశ్వ ప్రయత్నాలు చేస్తుంది. ఇందులో భాగంగానే చంద్రబాబు ఇప్పతివరకు చేయని ప్రయత్నాలు లేవని చెప్పాలి. అమరావతిలోనే అన్ని ఉండాలని ఆ పార్టీ అన్ని విదాలుగా స్కెచ్ లు వేస్తుంది. ఈ మేరకు వారివద్ద ఎన్నో అస్త్రాలు ఉన్నాయని టీడీపీ సీనియర్నేత యనమల రామకృష్ణుడు అంటున్నారు. ఆయన మాట్లాడుతూ రాజదాని అమరావతిలోనే ఉండేలా చేస్తామని అన్నారు. వైసీపీ పెట్టిన బిల్లులను అడ్డుకునేందుకు ఎలాంటి ప్రయత్నమైన చేస్తామని అన్నారు. వికేంద్రీకరణ బిల్లులను సెలెక్ట్ పంపడమా? లేక సవరణలు పెట్టి అసెంబ్లీకి పంపడమా? వంటి అంశాలు తమ దీష్టిలో ఉన్నాయని ఆయన చెప్పారు.
అయితే మరోపక్క ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. దీంతో ఒక్కసారిగా టీడీపీకి దిమ్మతిరిగిందనే చెప్పాలి. ఎందుకంటే బిల్లులను సెలెక్ట్ కమిటీకి ఇంకా పంపలేదని చైర్మన్ ఎంఏ షరీఫ్ స్వయంగా ప్రకటించడం అంతేకాకుండా టీడీపీ చేసిన వాదనలు తప్పని తేలడంతో ఏం చెయ్యాలో వారికి అర్ధం కావడంలేదు. ఇక ఎన్నో అస్త్రాలు ఉన్నాయని చెబుతున్న యనమల అవన్నీ పొట్లం కట్టి దాచుకుంటే మంచిదని కొందరు అభిప్రాయపడ్డారు.