తెలంగాణ మున్సిపల్ ఎన్నికల్లో టీఆర్ఎస్ ముందంజ ఉంది. భద్రాద్రి కొత్తగూడెం జిల్లాలోని కొత్తగూడెం, ఇల్లెందు మున్సిపాలిటీల్లో టీఆర్‌ఎస్ విజయం సాధించింది.
కొత్తగూడం మున్సిపాలిటీలోని 36 వార్డుల్లో అధికార టీఆర్‌ఎస్ పార్టీ 25 వార్డుల్లో గెలుపొందగా కాంగ్రెస్ పార్టీ-1, ఇతరులు-10 వార్డుల్లో గెలుపొందారు.
అదేవిధంగా ఇల్లెందు మున్సిపాలిటీలోని 24 వార్డుల్లో టీఆర్‌ఎస్-18, కాంగ్రెస్-1, ఇతరులు-5 స్థానాల్లో గెలుపొందారు.