తెలంగాణ రాష్ట్రంలో ఈ నెల ఇరవై రెండో తారీఖున నూట ఇరవై మున్సిపాలిటీలకు.. తొమ్మిది కార్పోరేషన్లకు ఎన్నికలు జరిగిన సంగతి విదితమే. ఈ రోజు శనివారం ఉదయం ఎనిమిది గంటల నుండి ఓట్ల లెక్కింపు ప్రక్రియ మొదలయింది. అన్ని చోట్ల అధికార పార్టీ టీఆర్ఎస్ ముందజంలో ఉంది.
అయితే ధర్మపురిలో మాత్రం అధికార పార్టీ టీఆర్ఎస్ ప్రధాన ప్రతిపక్ష పార్టీ కాంగ్రెస్ ల మధ్య నువ్వా నేనా అన్నట్లు పోరు సాగుతుంది. ఈ క్రమంలో ధర్మపురి మునిసిపాలిటీలో ఉన్న 15 వార్డుల్లో టీఆర్‌ఎస్ 8, కాంగ్రెస్ 7వార్డుల్లో గెలుపొందాయి.
ఈ నియోజకవర్గం నుండి మంత్రి కొప్పుల ఈశ్వర్ ప్రాతినిధ్యం వహిస్తున్నారు. అయితే ఇద్దరిని లాగేసుకునేందుకు రెండు పార్టీలు విశ్వ ప్రయత్నాలు చేస్తున్నాయి. అభ్యర్థులు మాత్రం ఫోన్లు స్విచ్ఛాఫ్ చేశారు. దీంతో ఇరు పార్టీల నేతల్లో ఆందోళన నెలకొంది.