తెలంగాణ రాష్ట్రంలో ఈ రోజు శనివారం విడుదలవుతున్న కొన్ని మున్సిపాలిటీలు ఫలితాలు చాలా ఆసక్తికరంగా వెలువడుతున్నాయి. వనపర్తి జిల్లా అమరచింతలో ఊహకందని ఫలితం వెలువడింది.
ఇక్కడ మొత్తం పది స్థానాలు ఉన్నాయి.. స్వతంత్ర అభ్యర్థులు ఏకంగా ఐదు స్థానాల్లో విజయం సాధించారు. అధికార టీఆర్ఎస్ పార్టీ మూడు స్థానాలను కైవసం చేసుకోంది..
కాంగ్రెస్ 1, బీజేపీ 1 స్థానాన్ని కైవసం చేసుకున్నాయి. దీంతో ఇక్కడ అధికార పీఠాన్ని ఏ పార్టీ దక్కించుకుంటుందనేది ఆసక్తికరంగా మారింది.