తెలంగాణ రాష్ట్రంలో జరిగిన మున్సిపల్ ఎన్నికల ఫలితాలు వెలువడుతున్నాయి. 120 మున్సిపాలిటీలు, 9 కార్పొరేషన్లలో పోలింగ్ జరుగగా.. కరీంనగర్ కార్పొరేషన్‌కు నిన్న ఎన్నికలు నిర్వహించారు. వీటి ఫలితాలు ఒక్కటిగా వస్తున్నాయి. ఇప్పటివరకు వచ్చిన రిజల్ట్ బట్టి చూస్తే అన్ని చోట్ల కార్ హావ నడుస్తుంది.
దాదాపు 90 % టీఆర్ఎస్ పార్టీ కే ప్రజలు మొగ్గుచూపారు. ఈ ఫలితాలు చూసి తెరాస శ్రేణులు సంబరాలు జరుపుకుంటున్నారు. తెలంగాణ భవన్లో సంబరాలకు పెద్ద ఎత్తున ఏర్పాట్లు జరుగుతున్నాయి.
కాగా ఇప్పటికే కేటీఆర్ పిలుపు మేరకు ఎమ్మెల్యేలు, ఎంపీలు తెలంగాణ భవన్‌కు చేరుకుంటున్నారు.ఫలితాల ట్రెండింగ్ ప్రారంభం కాగానే సంబరాలు నిర్వహించనున్నారు.అనంతరం పార్టీ నేతలతో మంత్రి, టీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ సమావేశమవనున్నారు. ఎక్స్ అఫిషియో ఓట్లపై కూడా కేటీఆర్ చర్చించనున్నట్లు సమాచారం.