పాపం..హిట్ కోసం కొట్టుమిట్టాడుతున్న మాస్ రాజా రవితేజ మళ్ళీ ఓ పాత రివెంజ్ కథకు సైన్స్ ఫిక్షన్ అనే ముసుగుతో మనముందుకు వచ్చాడు డిస్కో రాజాగా..టైగర్, ఎక్కడికి పోతావు చిన్నవాడా, ఒక్క క్షణం లాంటి డిఫరెంట్ చిత్రాలను తెరకెక్కించిన వీఐ ఆనంద్ నుంచి ఓ సినిమా వస్తుందంటే మనం ఏదో కొత్త పాయింట్..కొత్తదనం ఉంటుందని భావిస్తాo..దర్శకుడు వీఐ ఆనంద్ ఎంచుకున్న కధ బాగానే ఉన్నా కథనం బాగా స్లో గా ఉండటంతో మనకు మాములు రొటీన్ సినిమా చూసినట్టుంది..విభిన్న కథలను కొత్తగా తెరకెక్కించడంలో ఆనంద్ కు మంచి పేరుంది..ఎలాగైనా రవితేజకు హిట్ ఇవ్వాలన్న టెన్షన్ లో స్క్రీన్ ప్లే కాస్త గ్రిప్పింగ్ గా రాసుకోవడం మరచిపోయాడేమో..చుట్టూ కామెడియన్లతో డాన్ క్యారెక్టర్ ఎలా డిజైన్ చేశారో మనకర్ధం కాదు..ఏదేమైనా డిస్కో రాజా పాత్రలో రవితేజ మళ్ళీ మునుపటి ఎనర్జీతో ఇరగదీసాడు..
ఇదొక్కటే ఈ చిత్రానికి ప్లస్ పాయింట్..80ల్లో సన్నివేశాలు పర్వాలేదు..హీరో ఎనర్జీకి తమన్ సంగీతం సరిగ్గా సూటయ్యిoది..తమన్ తర్వాత మనం మెచ్చుకోవాల్సిన టెక్నిషియన్ కార్తీక్ ఘట్టమనేని..కార్తీక్ కెమెరా పనితనం చాలా చక్కగా ఉంది..ఎడిటర్ శ్రావణ్ కటికనేని తన కత్తెరకు కొంచెం పని పెడితే బాగుండేది..బాబీ సింహా విలనిజం బాగుంది..పాయల్ రాజపుత్ ను మరీ సంసారపక్షంగా చూపించారు..తనకోసం సినిమాకెళ్లిన వారికిది ఇబ్బందే..హీరోగారు మంచి ఎనర్జీతో ఫామ్ లోకి వచ్చినా కథనంలో ఏమాత్రం ఎనర్జీ లేకపోవటంతో ఉసూరుమనిపిస్తాడు..డిస్కో రాజా..!