టాలీవుడ్ లో యాంకర్ అనసూయ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. అందానికి అందం, టాలెంట్‌కు టాలెంట్, అచ్చ తెలుగులో అవలీలగా మాట్లాడే సత్తా ఇలా ప్రతీ వాటిలో అనసూయ ఆమెకు ఆమే సాటి అనిపించుకుంటూ ఉంటోంది. జబర్దస్ షోతో ఎంతో ఫేమస్ అయిన అనసూయ వెండితెరపైనా మెరిసింది. గ్లామర్ పాత్రలకే పరిమితం కాకుండా.. ఐటమ్ సాంగ్స్ అని మాత్రమే కాకుండా.. నటనకు ప్రాధాన్యమున్న చిత్రాలను చేస్తూ ఎంతో మంది అభిమానాన్ని సంపాదించుకుంది. అటు వెండితెరపై పలు ప్రాజెక్ట్స్, ఇటు బుల్లితెరపై పలు షోలతో బిజీగా గడిపేస్తుంది. అయితే బుల్లితెరపై వచ్చే డ్యాన్స్ షోలో జడ్జిగా వ్యవహరించే శేఖర్ మాష్టర్‌కు ఉన్న ఫాలోయింగే వేరు. ఆయన పంచ్‌లు, ఆయన స్టెప్పులు, రోజా, అనసూయలతో వేసే స్టెప్పులు ఎంత ఫేమస్సో అందరికీ తెలిసిందే. ఇదివరకే ఎన్నో ఈవెంట్స్‌లో చూశాం. రాజశేఖర.. అనే పాటకు వీరిద్దరు వేసిన స్టెప్పులు ఎంతో ఫేమస్. తాజాగా లోకల్ గ్యాంగ్స్.. జబర్దస్త్ నుంచి వేరుపడిన నాగబాబు జీ తెలుగులో లోకల్ గ్యాంగ్స్, అదిరింది అనే షోలను ప్రారంభించాడు. లోకల్ గ్యాంగ్స్‌కు అనసూయ, శేఖర్ మాష్టర్‌లను జడ్జిలుగా నియమించారు. అయితే ఈ షోలో తాజాగా అనసూయ, శేఖర్ మాష్టర్స్ చేసిన రచ్చ గురించి ఎంత చెప్పినా తక్కువే అవుతంది. నడుము మీద చేయి.. ఈమధ్య వీరి ఎంట్రీల్లో మరింత ఘాటుదనం కనిపిస్తోంది. తాజాగా రిలీజ్ చేసిన ప్రోమో మరింత వేడిని పుట్టించేలా ఉంది. బలపం పట్టి భామ ఒళ్లో అనే పాటకు వీరిద్దరు వేసిన స్టెప్పులు ఒకెత్తు అయితే.. అనసూయ నడుము మీద చేయి వేసి ఉంచడం మరో ఎత్తు. వీరి రొమాన్స్ పీక్స్‌లో ఉందని నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు.
