గత ఐదేళ్ళ పాలనలో చంద్రబాబు పేరు చెప్పుకొని మంత్రి హోదాలో ఉంటూ చాలా మంది చాలా చేసారు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని అన్యాయాలకు, అక్రమాలకూ పాల్పడ్డారు. ప్రజలు ఓట్లు వేసి వారిని గెలిపిస్తే చివరికి వారి గొంతులే కోశారు. ఒక్క పనికూడా చేయకుండా సొమ్ము మొత్తం దోచుకున్నారు. టీడీపీ అధికారంలో ఉన్నంతసేపు ఎమ్మెల్యేలు, మంత్రులు, నాయకులు సైతం దోచుకున్నారు. ఇందులో ముఖ్యంగా ఉమా విషయానికి వస్తే ఆయనపై ట్విట్టర్ వేదికగా విజయసాయి రెడ్డి చురకలు అంటించాడు. “ఇరిగేషన్ ప్రాజెక్టుల్లో నువ్వెంత దోచుకున్నది, ఇసుక మాఫియా ద్వారా ఎన్ని వేల కోట్లు పోగేసుకున్నది తొందర్లోనే బయట పడుతుంది. కాస్త ఓపిక పట్టు ఉమా. మ్యావ్ మ్యావ్ లు ఆపేయ్. నువ్వెంత గొంతు చించుకున్నా సింహంలా గర్జించ లేవు. ప్రాణాలు తీసిన హంతకుడివి. నువు నీతులు వల్లిస్తే ఎలా?” అని అన్నారు.
