ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని ప్రతిపాదించారు. ఈ బిల్లు విషయంలో ఎలాగైనా ఆపాలని విశ్వ ప్రయత్నాలు చేస్తున్న టీడీపీ కాసేపు ఆనంద మయంలో మునిగిపోయారు. కాని ఆ సంతోషం ఎంతోసేపు లేకుండా పోయింది. దీమిపై స్పందించిన వైసీపీ సీనియర్ నేత విజయసాయి రెడ్డి ట్విట్టర్ వేదికగా స్పందించారు. “పూల ఖర్చు వృథా అయినట్టేనా? కౌన్సిల్ లో ఏదో సాధించాడని పూల వర్షం కురిపించిన వారంతా తల పట్టుకుంటున్నారట. రాజధాని సంగతి దేవుడెరుగు. కౌన్సిల్ కు ఎసరు పెట్టాడని సొంత పార్టీ వాళ్లే పిడకలు విసురుతున్నారు. ఒకేసారి అన్ని దిక్కుల నుంచి సుడిగాలి చుట్టముట్టిందేమిటి విజనరీ?” అని అన్నారు.
