ఏపీ వికేంద్రీకరణ బిల్లుపై విషయంలో జరిగిన పరిణామాల నేపథ్యంలో జగన్ సర్కార్ ఏపీ శాసనమండలిని రద్దు చేసే దిశగా అడుగులు వేస్తోంది. జనవరి 27న కేబినెట్ భేటీ నిర్వహించి శాసనమండలిని రద్దు చేస్తూ నిర్ణయం తీసుకోనున్నట్లు సమాచారం. అదే రోజు అసెంబ్లీలో శాసనమండలి రద్దుపై చర్చ జరిపి…కేంద్రానికి తీర్మానం పంపనుంది. కాగా శాసనమండలి రద్దుపై టీడీపీ అభ్యంతరం చెబుతోంది. పెద్దల సభను ఎలా రద్దు చేస్తారు..మండలిని రద్దు చేయడం అంత ఈజీ కాదని చంద్రబాబు వాదిస్తున్నారు. అయితే మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా చంద్రబాబుకు గట్టి కౌంటర్ ఇవ్వడానికి సీఎం జగన్ గ్రౌండ్ వర్క్ పూర్తి చేసినట్లు తెలుస్తోంది. గతంలో వైయస్ శాసనమండలిని పునరుద్ధరించిన సమయంలో చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించారు. వైయస్ తన వర్గీయులకు సీట్లు, పదవులు ఇచ్చుకునేందుకే మండలిని పునరుద్ధరిస్తున్నారంటూ నాడు అసెంబ్లీలో చంద్రబాబు గళమెత్తారు.. కౌన్సిల్‌తో ప్రజాధనం వేస్ట్ తప్పా..ఉపయోగం లేదని బాబు గట్టిగా వాదించారు. ఇక్కడే వైసీపీకి బాబును ఇరికించే అస్త్రం దొరికింది. అప్పుడు మండలిని వ్యతిరేకిస్తూ బాబు మాట్లాడిన పత్రికల క్లిప్పింగులు, వీడియోలను వైసీపీ సిద్ధం చేస్తోంది.
తాజాగా మండలి రద్దుపై అసెంబ్లీలో చర్చ సందర్భంగా గతంలో చంద్రబాబు మండలిపై చేసిన వ్యాఖ్యల క్లిప్పింగులతో పాటు, వీడియోలు ప్రదర్శించడమే కాకుండా సీఎం జగన్ స్వయంగా బాబు మాటలను చదివి వినిపించబోతున్నట్లు సమాచారం. అంటే మండలిపై అప్పుడొక మాట..ఇప్పుకొక మాట అంటూ..చంద్రబాబు యూటర్న్‌లను అసెంబ్లీ వేదికగా బయటపెట్టనున్నారు. ఈ మేరకు 58 పేజీల డేటాను వైసీపీ సిద్ధం చేసినట్లు తెలుస్తోంది. ఒకవేళ సభలో టీడీపీ సభ్యులు రెచ్చగొడితే…సీఎం జగన్‌కు శాసనమండలి రద్దుకు తీర్మానం చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. ఇదే జరిగితే నారావారి పుత్రరత్నం లోకేష్ పదవి కూడా గల్లంతే..కనీసం ఇప్పుడు ఎమ్మెల్సీ హోదాలో లోకేష్ రాజకీయం చేస్తున్నాడు…అదే శాసనమండలి రద్దు అయితే…ఆ పదవి కూడా ఉండదు. నిజానికి వికేంద్రీకరణ బిల్లు నిబంధనలకు వ్యతిరేకంగా స్పీకర్ షరీఫ్ సెలెక్ట్ కమిటీకి పంపడంలో చంద్రబాబు, లోకేష్, యనమల కీలక పాత్ర పోషించారు. దీంతో శాసనమండలిని రద్దు చేయడం ద్వారా లోకేష్‌కు రిటర్న్ గిఫ్ట్ ఇవ్వడానికి సీఎం జగన్ రెడీ అయ్యారు. గత ఎన్నికల్లో తెలంగాణ సీఎం కేసీఆర్ చంద్రబాబుకు రిటర్న్ గిఫ్ట్..ఇచ్చినట్లే..లోకేష్‌కు సీఎం జగన్ రిటర్న్ గిప్ట్ ఇస్తున్నారు. మొత్తంగా అనూహ్య పరిణామాలు చోటు చేసుకుంటే తప్పా…ఏపీ శాసనమండలి రద్దు కావడం…లోకేష్ ఎమ్మెల్సీ పదవి వూస్టింగ్ కావడం దాదాపుగా ఖాయమైపోయాయి.. చినబాబు బర్త్‌డే సందర్భంగా… జగన్ ఇస్తున్న రిటర్న్ గిఫ్ట్ అదిరిపోయింది కదా.