Home / TELANGANA / 2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా కొవ్వొత్తి ర్యాలీ..!

2020 ప్రపంచ ఆరోగ్య సంస్థ సంవత్సరంగా ప్రకటించిన సందర్భంగా కొవ్వొత్తి ర్యాలీ..!

ఫ్లోరెన్స్ నైటింగేల్  200 వ జయంతిని పురస్కరించుకుని ప్రపంచ ఆరోగ్య సంస్థ 2020 నర్సుల  సంవత్సరంగా ప్రకటించినా సందర్భంగా శుక్రవారం కొవ్వొత్తి ర్యాలీని నిర్వహించారు.జిల్లా ప్రభుత్వ జనరల్ వైద్యశాల వద్ద వైద్యశాల ఎదుట వైద్యశాల సుప్రిండెంట్  నాగేశ్వరరావు మరియు నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రతినిధులు జెండా ఊపి ప్రారంభించారు.ఈ ర్యాలీలో దాదాపుగా వెయ్యి మంది నర్సస్ పాల్గొన్నారు.నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్ మాట్లాడుతూ 2020 నర్సుల సంవత్సరంను నర్సుల సంవత్సరంగా ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ప్రకటించింది. రోగులకు ఆరోగ్య సేవలను అందించడంలో నర్సులు కీలకపాత్ర పోషిస్తారని తెలిపారు. అందువల్ల నర్సింగ్, మిడ్‌వైఫరీ వర్క్‌ఫోర్స్‌లో ఎక్కువ పెట్టుబడులు పెట్టడం ద్వారా మాత్రమే సార్వత్రిక ఆరోగ్య కవరేజీని సాధించగలమని డబ్ల్యూహెచ్‌ఓ చెప్పింది ఆయన అన్నారు.

ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) ఫ్లోరెన్స్ నైటింగేల్ 200 వ జయంతిని పురస్కరించుకుని 2020 సంవత్సరాన్ని “నర్సు మరియు మిడ్వైఫరీ సంవత్సరంగా” ప్రకటించినట్లు మనకు తెలుసు. మన రాష్ట్రంలో రాష్ట్ర ప్రభుత్వం నర్సింగ్ సేవలను గుర్తిస్తూ వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి అని ఆయన అన్నారు. సుప్రీంకోర్టు ఉత్తర్వుల ప్రకారం కేంద్ర ప్రభుత్వం జారీచేసిన  ఆదేశాలు ప్రకారం ప్రవేట్ ఆసుపత్రిలో పనిచేసే స్టాఫ్ నర్సెస్ కు కనీస వేతనo 20,000/-ఇవ్వాలి అనే చట్టంను అమలు చేయాలి.మన రాష్ట్రములో జెండర్ తో సంబంధ లేకుండా మేల్ నర్సెస్ కూడ ఫిమేల్ నర్సెస్ తో పాటు సమానంగా ఉద్యోగ మరియు ఉన్నత విద్య కు అవకాశాలు కలిపించాలి.

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న నర్సింగ్ ఆఫీసర్ ఉద్యోగులను శాశ్వత ప్రాతిపదికన భర్తీ చేయాలి.అలాగే కాంట్రాక్టు నర్సింగ్ వ్యవస్థను పూర్తిగా రద్దు చేసి.ఉన్నవారిని రెగ్యులరైజ్  చేయాలి ప్రభుత్వ మరియు ప్రేవేటు ఆసుపత్రిలలో పని చేసే ప్రతి నర్సింగ్ ఆఫీసర్ కు ఉద్యోగ  మరియు ఆరోగ్య భద్రతా కల్పించాలి. రాష్ట్రంలో నర్సింగ్ డైరెక్టర్ ను ఏర్పాటు చేయాలి. రాష్ట్రములోచదువుతున్న ప్రతి నర్సింగ్ విద్యార్ధి కి 2017 సంవత్సరం నుoడి కాలేజీ ఫీజు పెంచిన విధము గానే నర్సింగ్ విద్యార్ధులకు స్కాలర్ షిప్స్ మరియ స్టెపంఢ్ వెంటనే పెంచాలి.నర్సింగ్ కుటుంబాల సంక్షేమం కోసం ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలి కేంద్ర సర్కారు సవరించిన హోదాను స్టాఫ్ నర్సు నుంచి నర్సింగ్ అధికారిగా మార్చుతూ రాష్ట్ర ప్రభుత్వం అనుబంధ ఉత్తర్వులను నేటి వరకు ఎందుకు అమలు చేయడం లేదు.. ఈ ఉత్తర్వులను అమలు చేయడం వల్ల రాష్ట్ర ప్రభుత్వ ఖజానా మీద నయా పైసా ఖర్చు ఉండదు..అయినా అమలు చేయడం లేదు.

రాష్ట్రములో ప్రభుత్వ స్థలంలో పేద నర్సింగ్ కుటుంబాలకు ప్రభుత్వం నర్సింగ్ ఆఫీసర్స్ కాలనీలు ఏర్పాటు చేయాలి. వైద్య శాఖలోనే పనిచేస్తున్న నర్సెస్ కి హెల్త్ కార్డులు అందచెయ్యాలి.ఈ ర్యాలీలో దాదాపుగా వెయ్యి మంది నర్సస్ పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్ర నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ , తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ మరియు నిజామాబాద్ ప్రభుత్వ నర్సింగ్  విద్యార్థులు , ప్రభుత్వ నర్సింగ్ ఉద్యోగులు అందరూ కలసి  కొవ్వొత్తి మార్చ్ ను నిర్వహించారు. ఈ మార్చ్ నిజామాబాద్ ప్రభుత్వ వైద్యశాల  నుండి మొదలై     గాంధీ చౌక్ వరకు  వెళ్లి తిరిగి మరల ప్రభుత్వ వైద్యశాలకు  చేరుకొని   అక్కడే  ఈ కొవ్వొత్తి మార్చ్ ముగిసింది.మనలో ప్రతి ఒక్కరికీ, ఇది ఒకసారి మనతరం అవకాశంగా భావించి .“నర్సు  మరియు మిడ్వైఫరీ సంవత్సరాన్ని” స్వాగతించడానికి సమయాన్ని వెచ్చించి వచ్చినందుకు కృతజ్ఞతలు.ఈ కార్యక్రమంలో నర్సింగ్ ఆఫీసర్స్ అసోసియేషన్ ముఖ్య సలహాదారులు చీలుపురి వీరాచారి గారు డాక్టర్ చెరుకూరి రామ్ తిలక్.ప్రధాన కార్యదర్శి లక్ష్మణ్ రూడవత్, కోశాధికారి వంశీ ప్రసాద్. తిరుమల కాలేజ్ ఆఫ్ నర్సింగ్ ప్రిన్సిపాల్ అనిత గారు  వైస్ ప్రిన్సిపాల్ సబితా, శ్రీనివాస్ మరియు ప్రభుత్వ నర్సింగ్  విద్యార్థులు మరియు   ఉద్యోగుల పాల్గొన్నారు..

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat