ఆక్లాండ్ వేదికగా భారత్ న్యూజిలాండ్ మధ్య జరిగిన మొదటి టీ20 లో ఇండియా ఘనవిజయం సాధించిన విషయం తెలిసిందే. ఇరు జట్లమధ్య హోరాహోరీ పోరు జరిగినప్పటికీ చివరికి విజయం భారత్ వసం అయ్యింది. ఇందులో అర్ధ శతకాల రికార్డు మోగింది. కోహ్లి, రాహుల్, ఐయ్యర్ అద్భుతంగా రాణించారు. అయితే ఈ మ్యాచ్ ద్వారా భారత్ మరో రికార్డు తన ఖాతాలో వేసుకుంది. అదేమిటంటే 200పరుగుల చేసింగ్ ను 4సార్లు చేజ్ చేసిన మొదటి జట్టు ఇండియానే. ఆ తరువాత ప్లేస్ లో ఆస్ట్రేలియా ఉంది.