ప్రతిపక్ష నేత చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో.. 13 జిల్లాలకు విలన్. అని వైసీపీ ఎమ్మెల్యే గుడివాడ అమరనాద్ అన్నారు. చంద్రబాబు పనికిరాని వారిని శాసనమండలికి తీసుకు వచ్చారని ఆయన ఆరోపించారు. కొబ్బరి చిప్పలు అమ్ముకునే బుద్ధా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమల రామకృష్ణుడిని ఎమ్మెల్సీని చేశారు. స్పీకర్‌గా యనమల చేసిన కుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసు. రాజకీయ భిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది? చంద్రబాబు చేస్తున్న పోరాటాలు తాత‍్కాలికమే. ఆయన కుట్రలను ప్రజలంతా గమనిస్తున్నారు. చంద్రబాబు తాత దిగొచ్చినా వికేంద్రీకరణ బిల్లును అడ్డుకోలేరు. అయితే తన స్వార్థపూరిత రాజకీయాల కోసం మండలిని ఉపయోగించుకోవడం దారుణం. మండలిని ఆనాడు ఎన్టీఆర్ రద్దు ఎందుకు చేశారో అందరికీ తెలుసు. అని ఆయన అన్నారు.
