చంద్రబాబు మూడు గ్రామాలకే హీరో అని మిగతా 13 జిల్లాలకు విలన్‌గా మారారని, ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 జిల్లాలకు హీరో అని వైయస్‌ఆర్‌సీపీ ఎమ్మెల్యే గుడివాడ అమర్‌నాథ్ పేర్కొన్నారు. మూడు గ్రామాల రైతుల సమస్యను నారా చంద్రబాబు నాయుడు జాతీయ సమస్యగా చిత్రీకరించారన్నారు. మండలిలో పెద్ద విజయం సాధించినట్లుగా చంద్రబాబు హీరోగా ఫీలవుతున్నారని. ఆయన 13 జిల్లాలకు విలన్‌గా మిగిలిపోతారన్న విషయాన్ని గమనించాలన్నారు.
కొబ్బరిచిప్పలు అమ్ముకునే బుద్దా వెంకన్నను మండలిలో కూర్చోబెట్టారు.. తాను మేధావినంటూ వరుసగా ఓడిపోయిన యనమలను ఎమ్మెల్సీ చేశారు. స్పీకర్‌గా యనమల చేసినకుట్రలు పైనున్న ఎన్టీఆర్‌కు తెలుసన్నారు. ఆయన సెల్ఫ్ సర్టిఫికెట్ మేధావి అని రాజకీయభిక్ష పెట్టిన ఎన్టీఆర్‌కు సభలో మైక్ ఇవ్వని మీరా రూల్స్ గురించి మాట్లాడేది. దీపక్ రెడ్డి అఆర్థిక నేరస్తుడు ఈ రకమైన వ్యక్తులను తీసుకొని వచ్చి శాసనమండలిలో కూర్చోబెట్టారు. అలాగే జనసేన అధినేత పవన్ కళ్యాణ్‌ది లాంగ్ మార్చ్ కాదు.. రాంగ్ మార్చని అమర్‌నాథ్ విమర్శించారు. గాజువాక ప్రజలు పవన్‌ను ఓడించారని, అందుకే విశాఖకు రాజధాని రాకుండా అడ్డుపడుతున్నారు. పవన్‌కు సిద్ధాంతాలు లేవని, కేవలం ఐదేళ్లలో మొత్తం ఆరు పార్టీలు మారిన నేత పవన్‌కళ్యాణ్ తప్ప ఈ రాష్ట్రంలో మరెవ్వరూ లేరన్నారు.