చంద్రబాబుకు కష్టం లేదా అవసరం వచ్చినప్పుడో తప్ప పవన్ కళ్యాణ్ కు రాజకీయాలతో పనుండదు. గత కొన్నేళ్లుగా ఈ తంతు జరుగుతూనే ఉంది. బాబు స్క్రిప్టుకు పవన్ యాక్టర్. పుత్రుడు లోకేష్ నటనలో వీక్ అయినా దత్త పుత్రుడు మాత్రం పీక్ లో ఉంటున్నారు. సినిమాల్లో కంటే రియల్ లైఫ్ లోనే రాణిస్తున్నాడన్న పేరు రాష్ట్రవ్యాప్తంగా తెచ్చుకున్నాడు. ఎన్నికల సమయాల్లో అయితే ప్రత్యక్షంగా లేదా పరోక్షంగా బాబుకు మద్దతు ఇవ్వడంకోసం రాజకీయ నేత అవుతాడు. బాబు గురించి నెగిటీవ్ వార్తలు వస్తున్న సమయాల్లో వెంటనే స్పందిస్తాడు. బాబు మీద ఈగవాలకుండా విషయాన్ని డైవర్ట్ చేస్తాడు. ట్విట్లర్లో లనూ ఊగిపోతూ, ప్రెస్ మీట్లలో , సభల్లో రెచ్చిపోయి పెర్ఫార్మెన్స్ చేస్తాడు.
సీఎం జగన్ కు ప్రజల్లో ఆదరణ పెరుగుతోందనుకున్నప్పుడు సంక్షేమ పథకాలు, ఆయన నిర్ణయాల వల్ల ప్రజల్లో ఆదరణ పెరుగుతుంది అనుకోగానే మళ్లీ రంగంలోకి దిగుతాడు. చంద్రబాబుపై విమర్శలు వచ్చిన సమయంలో మాత్రం తమ పార్టనర్ పై విమర్శల వర్షం పడుతోందనగానే టీడీపీ కష్టకాలంలోకి వెళ్లకుండా బీజేపీతో పొత్తుకోసం ప్రయత్నాలన్నీ బెడిసికొడుతున్న తరుణంలో బాబును ఆదుకునే ఆపద్భాంధవుడిలా డిల్లీకి పయనమవుతాడు ఇలా ఎప్పుడు చంద్రబాబుకు అవసరం వచ్చినా వాలిపోతూ తన బాబు భక్తిని చాటుకుంటున్నాడు.