Home / ANDHRAPRADESH / అమరావతిలో చంద్రబాబు పవన్‌కు వాటా ఇచ్చాడా… ఆ 62 ఎకరాల సంగతేంటి..?

అమరావతిలో చంద్రబాబు పవన్‌కు వాటా ఇచ్చాడా… ఆ 62 ఎకరాల సంగతేంటి..?

అమరావతిలో టీడీపీ అధినేత చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్‌లతో సహా, ఒక సామాజికవర్గానికి చెందిన మాజీమంత్రులు, మాజీ ఎమ్మెల్యేలు, ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యేలు కొందరూ ఇన్‌సైడర్ ట్రేడింగ్‌‌కు పాల్పడి 4 వేల ఎకరాలకు పైగా భూములు కొల్లగొట్టారని… రియల్ ఎస్టేట్ వ్యాపారం చేసి వేల కోట్లు గడించారని వైసీపీ నేతలు ఆరోపిస్తున్నారు. ప్రభుత్వం మూడు రాజధానుల ప్రకటన చేయగానే… తమ భూములకు విలువ తగ్గిపోయి నష్టపోతామనే భయంతో చంద్రబాబుతో సహా, టీడీపీ నేతలు రాజధాని రైతులను రెచ్చగొట్టి నెలరోజులుగా ఆందోళనలు చేయిస్తున్నారు. కాగా అమరావతి ఆందోళనల్లో చంద్రబాబుకు ఆయన రహస్య పార్టనర్ పవన్ కల్యాణ్ మద్దతు పలికారు. రాజధానిని అమరావతి నుంచి తరలించే సహించేది లేదని పవన్ కల్యాణ్ పదేపదే ప్రభుత్వానికి వార్నింగ్‌లు ఇస్తున్నాడు. కేంద్రంతో మాట్లాడి రాజధాని తరలింపును అడ్డుకుంటామని..అమరావతి గ్రామాల ప్రజల జీవితాల్లో చెలగాటం ఆడుతున్న ఇలాంటి ముఖ్యమంత్రి మట్టికొట్టుకుని పోతారని పవన్ శాపనార్థాలు పెడుతున్నారు. కాగా అమరావతి ఆందోళనలకు మద్దతు పలుకుతున్న పవన్ కల్యాణ్‌పై రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రజలు మండిపడుతున్నారు. గతంలో తన దృష్టిలో రాజధాని కర్నూలే అని పవన్ ప్రకటించారు. అలాగే అమరావతి ఒక కులం కోసం కట్టుకుంటున్న రాజధాని అని గతంలో పవన్ అన్నారు. అయితే ఇప్పుడు మాత్రంఅదే అమరావతి కోసం రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నారు.. కవాతులతో కదం తొక్కుతున్నారు.

అయితే పవన్ ఇంతగా రాజధాని రాజకీయం చేయడం వెనుక భూబాగోతం ఉందని తెలుస్తోంది. ఇన్‌సైడర్ ట్రేడింగ్‌లో భాగంగా చంద్రబాబు తన పార్టనర్ పవన్ కల్యాణ్‌కు 62 ఎకరాల భూమి ధారాదత్తం చేశారని ప్రచారం జరుగుతోంది. తాజాగా వైసీపీ నేత రవిచంద్రారెడ్డి ఈ విషయంపై స్పందిస్తూ…గత కొన్నేళ్లుగా పవన్ కల్యాణ్‌ అమరావతి ప్రాంతంలో 62 ఎకరాలు కొనుగోలు చేశారని ఆరోపించారు. ఆ భూముల్లో కొంత పవన్ కల్యాణ్ పేరిట… మరి కొంత భూమి ఆయన తల్లి అంజనాదేవి పేరిట ఉన్నాయి. అమరావతి ప్రాంతంలో పవన్ పేరిట నలభై ఎకరాల వరకూ ఉందని ఆయన తల్లి పేర ఇరవై ఎకరాల వరకూ భూమిని కొనుగోలు చేశారని రవిచంద్రారెడ్డి ఆరోపించారు. ఈ మేరకు పవన్ భూబాగోతంకు సంబంధించి కొన్ని డాక్యుమెంట్లను కూడా రవిచంద్రారెడ్డి మీడియాకు బయటపెట్టారు. ఏప్రిల్ 13, 2018 న కొణిదెల ప‌వ‌న్‌క‌ల్యాణ్ పేరుపై రాజుల‌పాలెం, లింగాయ‌పాలెంల‌లో స‌ర్వే నంబ‌ర్ 64 బీ, 67బీ, 83బీ, మంద‌డం ద‌గ్గ‌ర 131 ఎ, 139ఎలో 62 ఎక‌రాలు కొన్న‌ట్టు డాక్యుమెంట్స్ ఉన్నాయి. రాజధాని ప్రాంతంలో ఒకవేళ నిజంగానే సవన్ కల్యాణ్‌కు 62 ఎకరాలు ఉన్నాయని తెలిస్తే..రాజకీయంగా ఇబ్బందులు తప్పవు..వైజాగ్‌లో వైసీపీ నేతలు భూములు కొన్నారని అందుకే రాజధానిని తరలిస్తున్నారని పవన్ ఆరోపిస్తున్నారు. ఇప్పుడు అమరావతిలో పవన్‌‌కు 62 ఎకరాలు ఉన్నాయని సంగతి రుజువైతే…తన భూముల కోసమే చంద్రబాబుతో కలిసి మూడు రాజధానులకు వ్యతిరేకంగా పవన్ ధర్నాలు, కవాతులు చేస్తున్నారన్న అభిప్రాయం ఏర్పడుతుంది. మొత్తంగా అమరావతిలో 62 ఎకరాల భూబాగోతం వార్తలతో పవన్ కల్యాణ్‌ ఇమేజ్ డ్యామేజీ అయిందనే చెప్పాలి.

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat