టాలీవుడ్ స్టార్ దర్శకుడు హారీష్ శంకర్ ప్రస్తుతం తెలుగు సినిమా ఇండస్ట్రీలో హాట్ టాఫిక్ అయ్యాడు. తన అధికారక ట్విట్టర్ ఖాతాలో హారీష్ శంకర్ చేసిన ట్వీట్ ప్రస్తుతం కాకలేపుతుంది.
ట్విట్టర్లో ” నేనూ గెలవాలి.. ఆల్ ది బెస్ట్ .నేను గెలవాలి. ఒకే,నేనే గెలవాలి అని దర్శకుడు హారీష్ శంకర్ పోస్టు చేశాడు. అయితే ఈ పోస్టు ఎవరి గురించి చేశాడన్నది మాత్రం ఎవరికి ఆర్ధం కావడం లేదు.
సరిలేరు నీకెవ్వరు,అల వైకుంఠపురములో గురించి హారీష్ ట్వీట్ చేశాడని కొంతమంది అంటున్నారు. మరికొంత మంది కాదు ప్రస్తుతం ఏపీలో నెలకొన్న రాజకీయ పరిస్థితుల నేపథ్యం గురించి ఈ ట్వీట్ చేశాడని అంటున్నారు. మరి హారీష్ సారు యొక్క ఉద్ధేశ్యం ఏంటో కాలమే చెప్పాలి.