ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో భాగంగా మనం చదువుకుందాం..! నిరక్షరాస్యతను నిర్ములిద్దామని రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీశ్ రావు గారు కోరారు. జిల్లా కేంద్రమైన సిద్ధిపేటలోని ఆయన నివాసంలో శుక్రవారం ఉదయం ఏంఆర్పీఏస్ డప్పు చంద్రం ఆధ్వర్యంలో చేపట్టిన తెలంగాణ రాత్రి బడి- బాల కార్మికులను బడిలో చేర్పించే కార్యక్రమ బ్యానర్ ను మంత్రి చేతుల మీదుగా ఆవిష్కరించారు.
ఈ సందర్భంగా మంత్రి హరీశ్ రావు గారు మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ ఇచ్చిన పిలుపు మేరకు ఈచ్ వన్ టీచ్ వన్ కార్యక్రమంలో భాగంగా మన బతుకులను మనమే బాగు చేసుకుందామని డప్పు చంద్రం తీసుకున్న నిర్ణయాన్ని మంత్రి అభినందించారు.
ఎస్సీ కాలనీల్లోని నిరక్షరాస్యతను నిర్ములించేలా చర్యలు తీసుకున్నందుకు డప్పు చంద్రం స్ఫూర్తిగా నిలిచారని., ఇదే పంథాను కొనసాగించాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ రాజనర్సు, సుడా చైర్మన్ రవీందర్ రెడ్డి, ఇతర ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు.