ఏపీ ప్రతిపక్ష నేత నారా చంద్రబాబు నాయుడు మరోసారి భారతీయ జనతా పార్టీతో పొత్తు పెట్టుకునేందుకు వెంపర్లాడుతున్నట్టు రాష్ట్ర ప్రజలంతా గమనిస్తున్నారు. గతంలో బిజెపి వల్ల అధికారంలోకి వచ్చిన చంద్రబాబు అనంతరం బిజెపి ప్రత్యేక హోదా ఇవ్వని కారణంగా ఆ పార్టీపై వ్యతిరేకత వస్తుందని ఆ వ్యతిరేక తనకు అంటుకోకుండా బిజెపికి దూరమయ్యారు. అంతేకాదు బిజెపికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా మిగతా రాష్ట్రాల్లోనూ ప్రచారం చేశారు. తెలుగుదేశం పార్టీ ప్రతిపక్షంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. ఇప్పుడు బిజెపి జనసేన కలిసి వైసిపికి ప్రత్యామ్నాయ రాజకీయ శక్తిగా ఎదుగుతుడడంతో తెలుగుదేశం పార్టీ మూడో స్థానానికి పడిపోతుందని భయంతో చంద్రబాబు ఇప్పుడు మళ్లీ బీజేపీతో పొత్తు కోసం ప్రయత్నిస్తున్నారు. ఇటీవల కేంద్ర ప్రభుత్వానికి మద్దతుగా ఆయన చేసిన వ్యాఖ్యలు అందుకు ఉదాహరణ. పవన్ కళ్యాణ్ తో రాయబారం నడిపి మరోసారి బిజెపితో కలిసేందుకు చంద్రబాబు ఎదురుచూస్తున్నాడని అర్థమవుతోంది.