ఆంధ్రప్రదేశ్ విభజన తరువాత రాజధానిగా కర్నూలు నగరం ఉండగా, అప్పట్లో ప్రజలు ఎక్కడ తిరుగుబాటు చేస్తారో అని బాబు 2014 రిపబ్లిక్ డే వేడుకల్లో తప్పుడు హామీలు ఇచ్చి మోసం చేశారని, వైసీపీ శాసనసభ సభ్యుడు హాఫీజ్ ఖాన్ విరుచుకుపడ్డారు. కర్నూలు జిల్లా ప్రజల హక్కులను నేలరాస్తూ ప్రజల అభిప్రాయలు పట్టించుకోకుండా అమరావతి ప్రాంతాన్ని రాజధానిగా నిర్ణయించారని ఆయన చంద్రబాబు పై మండిపడ్డారు. పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయిన డిప్యూటీ సీఎం అంజాద్‌బాషాతో కలిసి హాఫీజ్ ఖాన్ మీడియాతో మాట్లాడారు.
గత నాలుగు రోజులనుండి జరుగుతున్న పరిస్థితులు పరిశీలిస్తే వికేంద్రీకరణ గురించి పరిశీలించి, కచ్చితంగా రాష్ట్రం కలిసికట్టుగా ఉండాలని, మళ్లీ ఉద్యమం రాకూడదని, ఏపీ బాగుండాలని, ప్రతి జిల్లా బాగు పడాలని బిల్లు తీసుకొచ్చారు. 3 రాజధానులు తీసుకొస్తే అన్ని ప్రాంతాలు బాగుంటాయని ఈ నిర్ణయం తీసుకున్నారు. గత ఐదేళ్ల పాలనలో చంద్రబాబు 2014లో ఆగస్టు 15వ తేదీన కర్నూలు వచ్చి స్మార్ట్ సిటీ అన్నారు.. టెక్స్‌టైల్ పార్క్, సీడ్ హబ్ వస్తాయన్నారు. అసలు రాజధాని అన్నది కర్నూలు ప్రజల హక్కు అని అప్పుడు తీయ్యని మాటలు చెప్పి తరువాత అమరావతిని రాజధానిగా చేశారు. అలాగే శ్రీబాగ్ ఒప్పందం ప్రకారం కర్నూలునే రాష్ట్ర రాజధాని చేయాలన్నారు. గుంటూరులో హైకోర్టు ఏర్పాటు చేయాలన్నారు.