ఏపీ శాసనమండలి వివాదం ఏపీ రాజకీయాలను కుదిపేస్తోంది. వికేంద్రీకరణ, సీఆర్డీయే బిల్లును టీడీపీకి చెందిన స్పీకర్ షరీఫ్ నిబంధనలకు వ్యతిరేకంగా సెలెక్ట్ కమిటీకి పంపడంపై తీవ్ర ఆగ్రహంతో ఉన్న జగన్ సర్కార్ ఏకంగా శాసనమండలి రద్దు దిశగా అడుగులు వేస్తోంది. ప్రస్తుతం ఏపీలో శాసన మండలి రద్దుపై జోరుగా చర్చ జరుగుతోంది. సీఎం జగన్ సైతం..స్వయంగా అసెంబ్లీలో మండలి రద్దు అవసరమా కాదా అనే విషయంపై సోమవారం చర్చించి నిర్ణయం తీసుకుందామని ప్రతిపాదించారు. తాజాగా ఈ నెల 27 న ఉదయం 9.30 గంటలకు కేబినెట్ సమావేశం ఏర్పాటు చేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. శాసన మండలి రద్దు అంశాన్ని కేబినెట్లో ఆమోదించి..అదే రోజు అసెంబ్లీలో తీర్మానం ప్రతిపాదించాలని సీఎం జగన్ నిర్ణయించారు. అసెంబ్లీలో చర్చ తర్వాత కౌన్సిల్ రద్దుపై తీర్మానాన్ని ఆమోదించి కేంద్రానికి సిఫార్స్ చేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. మొత్తంగా మండలి పేరుతో రాజకీయం చేస్తున్న టీడీపీకి చెక్ పెట్టేందుకు సీఎం జగన్ సిద్ధమైనట్లు తెలుస్తోంది. టీడీపీ అధినేత చంద్రబాబు అమరావతి కోసం చేసిన కుటిల రాజకీయం.. ఏకంగా శాసన మండలి రద్దుకు కారణమవుతోంది.
