Home / SLIDER / వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి.

వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేయాలి.

హైదరాబాద్ లోని ఓ హోటల్ లో నాబార్డ్ ఆధ్వర్యంలో స్టేట్ క్రెడిట్ సెమినార్ కి ముఖ్య అతిధిగా ఆర్థిక మంత్రి హరీశ్ రావు హజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ”తెలంగాణ రాష్ట్రం వ్యవసాయానికి అధిక ప్రాధాన్యతనిచ్చే రాష్ట్రం. సీఎం కేసీఆర్ స్వయంగా రైతు. రైతుల కష్టనష్టాలు తెలిసిన వ్యక్తి సీఎం కేసీఆర్.వ్యవసాయం చాలా కష్టమైంది. వ్యవసాయం చేసే రైతుకు ఒకప్పుడు గొప్ప గౌరవం లభించేంది. వ్యవసాయం పట్ల ఆయా ప్రభుత్వాల చిన్నచూపు, ఇతర కారణాలు ఏవైనా వ్యవసాయ రంగం ప్రాధాన్యత కోల్పోయింది. దానిపై ఆధారపడ్డ రైతు గౌరవం కోల్పోయారు.రైతు వ్యవసాయం చేస్తూ తనపై తను ఆధారపడే వాడు కాదు. వ్యవసాయం కోసం విత్తనాలపై ఆధారపడాలి,  ఆతర్వాత ఎరువులు, అన్ని సక్రమంగా ఉంటే వర్షం పైన ఆధారపడాలి. పంట పండాక ధర కోసం మార్కెటింగ్ పైన ఆధారపడాల్సిన పరిస్థితి.తెలంగాణ ఏర్పడిన తర్వాత సీఎం కేసీఆర్ రైతుల సమస్యలపై దృష్టి సారించారు. ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని బలోపేతం చేయడం ప్రాధాన్యత అంశంగా తీసుకుంది.ఈ ప్రక్రియలో నాబార్డ్ చాలా సహకారం అందజేసింది. తెలంగాణ ఏర్పడిన నాటికి గోదాముల సామర్థ్యం చాలా తక్కువ. సీఎం కేసీఆర్ దీనిపై దృష్టి పెట్టి గోదాముల సామర్థ్యం పెంచాలన్నారు. మార్కెటింగ్ శాఖ మంత్రిగా నేను ఆనాడు 1056 కోట్లతో గోదాముల నిర్మాణఁ చేపట్టాం.

ఇందుకు నాబార్డ్ సహకారం అందించింది. ఆతర్వాత మైక్రో ఇరిగేషన్ కోసం నాబార్డ్ 874 కోట్లు సాయం అందించింది. దీంతో చిన్న నీటి వనరులను పెంచుకోగలిగాం.ప్రభుత్వం బడ్జెట్ మొత్తంలో 30 శాతం వ్యవసాయ రంగానికే ఖర్చు చేస్తోంది. మరే రాష్ట్రం దేశంలో రైతు కోసం ఇంత ఖర్చు చేయడం లేదు. రైతు బంధు పథకం కింద 12 వేల రూపాయలను రైతులకు ఏటా ఖర్చు చేస్తున్నాం.దేశంలో ఎక్కడా లేని విధంగా ఐదు లక్షల రూపాయల బీమా సౌకర్యాన్ని కల్పిస్తున్నాం. రైతు ఏ కారణంతో చనిపోయినా ఐదు లక్షల రూపాయలు ఆయన భార్యకు అందేలా ఈ బీమా సౌకర్యం కల్పించాం. ఇందు కోసం ఏటా 1136 కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నాం.గత ఐదేళ్లు రుణ మాఫీ పథకం అమలు చేశాం. ఇప్పుడు అమలు చేయనున్నాం. ఇందు కోసం ఏటా ఆరు వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం.రైతుల వ్యవసాయ పంపు సెట్లకు, బావులకు ఉచిత  విద్యుత్ సౌకర్యం కల్పిస్తున్నాం. దీంతో పాటు రైతు వ్యవసాయానికి నీరు ఇచ్చేందుకు మేజల్ లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా అంటే కాలేశ్వరం, నెట్టెంపాడు, బీమా, వంటి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టులకు ఉచిత విద్యుత్ అందిస్తున్నాం.

ఇలా ఉచిత కరెంట్ రైతు ల కోసం ఇచ్చేందుకు మొత్తంగా ఏటా 8 వేల కోట్లు ఖర్చు చేస్తున్నాం. పశుసంవర్థక శాఖ ద్వారా వ్యవసాయ ఆధారిత రంగాలైన డైరీ, ఫిషరీష్, పౌల్ట్రీ, గోర్రెల పెంపకం కోసం ప్రతీ ఏటా ఖర్చు చేస్తున్నాం.ఇరిగేషన్ కోసం నేరుగా ప్రభుత్వం బడ్జెట్ నుంచి 9 వేల కోట్లు, బ్యాంకుల నుంచి 25 వేల కోట్లు  ఖర్చు చేస్తున్నాం.తెలంగాణ రాకముందు పేపర్ చూస్తే అన్నీ ఆత్మహత్యల వార్తలే ఉండేవి. ప్రస్తుతం ఆ వార్తలు పేపర్లో కనిపించడం లేదంటే..తెలంగాణ ప్రభుత్వం రైతుల కోసం వ్యవసాయంపై చెస్తోన్న కృషి ఫలితమే.వ్యవసాయం దండగ అనే స్థాయి నుంచి వ్యవసాయం లాభసాటి అనే స్థాయికి తెచ్చాం.తెలంగాణ ఖర్చు చేస్తున్నంత వ్యవసాయ రంగంపై, ఉచిత విద్యుత్ పై దేశంలో ఏ రాష్ట్రం ఖర్చు చేయడం లేదు.వ్యవసాయానికి ముఖ్య వనరు అయిన ఇరిగేషన్ కోసమే ప్రతీ ఏటా 25 వేల కోట్ల ఖర్చుచేస్తున్నాం.తెలంగాణ సీడ్ బౌల్ ఆఫ్ ఇండియా. కేవలం ఇండియాకే కాదు. ఆఫ్రికా, ఆసియా దేశాలకు సీడ్ ఎక్స్ పోర్ట్ లో తెలంగాణ భాగస్వామ్యం పెరిగింది.రైతుకు ప్రధాన సమస్య రెవిన్యూ రికార్డ్స్. ముఖ్యమంత్రి కేసీఆర్ చొరవతో రెవెన్యూ రికార్డుల సమస్యలను పారదర్శకంగా దేశంలో ఎక్కడా లేని విధంగా పరిష్కరించాం. 96 శాతం రెవెన్యూ రికార్డుల సమస్యలను పరిష్కరించాం. మిగిలిన నాలుగు శాతం లీగల్ కేసులకు సంబంధించినవి.

రైతును బలోపేతం చేసేందుకు ఇప్పటి వరకు నాబార్డ్, గ్రామీణ బ్యాంకులు, ఇతర వాణిజ్య బ్యాంకులు రుణాలు ఇచ్చాయి. ఇప్పుడు వ్యవసాయ ఆధారిత రంగాలను బలోపేతం చేయాల్సి ఉంది. ఈ రంగాలను బలోపేతం చేసేందుకు రుణాలు ఇవ్వాలి.పాడిపశువులు, పౌల్ట్రీ, గోర్రెల యూనిట్లు ఇవ్వాలి. ఇలాంటివి రైతుకు లాభం చేకూర్చుతాయి.గోల్ల కురుమల కోసం 4500 కోట్లతో గోర్రెల యూనిట్ ఇస్తున్నాం. ఇప్పటి వరకు 3 లక్షల 75 వేల యూనిట్లు గ్రౌండ్ చేశాం. దీని ఫలితంగా 80 లక్షల కొత్త గొర్రె పిల్లలు వచ్చాయి. వీటి విలువ 3500 కోట్లు.దేశంలోనే తొలి సారిగా మోబైల్ వెటర్నరీ క్లినిక్ లు ఏర్పాటు చేశాం.దేశంలో  ఫిషరీస్ లో ఎక్కువ సోసైటీలున్న రాష్ట్రం తెలంగాణయే. దాదాపు 4400 సోసైటీలు ఇక్కడ ఉన్నాయి. దీని ద్వారా 2 లక్షల కుటుంబాలు ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉపాధి పొందుతున్నాయి. మిషన్ కాకతీయ కింద చెరువులను బాగు చేసి వాటిల్లోను, రిజర్యార్లలో 64 కోట్ల రూపాయలతో 3.4 కోట్ల ఫిష్ సీడ్స్ ఉచితంగా సరఫరా చేశాం.  దీని వల్ల వేల కోట్ల ఆదాయం వస్తోంది.ఫిషరీస్ లో దేశంలో కేరళ తర్వాత తెలంగాణ రెండో స్థానంలో ఉంది.వ్యవసాయ ఆధారిత రంగాలపై  మనమంతా ఫోకస్ చేయాలి. ప్రాసెసింగ్, మార్కెటింగ్, స్టోరేజి, ఎక్స్ పోర్ట్స్ రంగాలను అభివృద్ధి చేయాలి.రైతుల శ్రమకు తగిన ప్రతిఫలం పొందాలంటే ఇవి ముఖ్యం. రైతుకు ప్రధాన సమస్య ఇప్పుడు మార్కెటింగ్ సమస్య. వ్యవసాయ ఉత్పత్తులకు ప్రాసెసింగ్ ద్వారానే అదనపు విలువ జోడించినట్లవుతుంది.

దీని వల్ల ఆదాయం పెరుగుతుంది.నాబార్డ్, రూరల్ బ్యాంకులు, వాణిజ్య బ్యాంకులు వ్యవసాయశాఖ, గ్రామీణాభివృద్ధి శాఖలతో సమన్వయంతో పని చేయాలి. మేడ్చెల్ జిల్లా జీడిమెట్లలో, సిద్దిపేట జిల్లా ములుగులో ప్రాసెసింగ్ యూనిట్లు పెట్టాం. సీడ్స్ నుంచి ఎక్స్ పోర్టింగ్ వరకు ఇక్కడ నిపుణులతో రైతులకు శిక్షణ కార్యక్రమాలు చేపడుతున్నాం.క్రాప్ కాలనీలను కూడా ప్రభుత్వం త్వరలో ఏర్పాటు చేస్తుంది.వ్యవసాయానికి సహకారం అదించడం ఎంత ముఖ్యమో…. వ్యవసాయాధారిత రంగాలను, వ్యవసాయ ఆధారిత పరిశ్రమలను అంతే ప్రోత్సహించాలి.వ్యవసాయ రంగంలో కూలీల సమస్య అధికంగా ఉంది. మున్ముందు రైతు కూలీలు దొరకకపోవచ్చు.

ఈ పరిస్థితులకు అనుగుణంగా రైతులు టెక్నాలజీని వినియోగించుకోవాల్సిన అవసరం ఉంది.పెద్ద రైతులకు ఉపయోగపడే టెక్నాలజీ కాకుండా, చిన్న, సన్న కారు రైతులకు ఉపయోగపడేలా సాంకేతిక సాయం అందించాలి. అవసరమైన యంత్ర సామగ్రి సమకూర్చాల్సి ఉంది.ఈ విషయంపై దృష్టి సారించిన సీఎం కేసీఆర్ రాష్ట్ర అధికారులను జపాన్ కు , ఇతర దేశాలకు పంపి అక్కడి వ్యవసాయ టెక్నాలజీని, సాంకేతిక యంత్రాలను పరిశీలించాలని సూచించారు.వరి నాట్ల యంత్రం, కలుపు తీసే యంత్రం, కుప్ప నూర్చే యంత్రాలు వాడాల్సి ఉంది. ఇందు కోసం ప్రభుత్వం రాయితీ ఇస్తుంది. బ్యాంకులు సైతం మద్ధతు ఇవ్వాలి.రెండు పంటలు పండిచే విధంగా ప్రభుత్వం చర్యలు తీసుకుటుంది కనుక… ఆ రీతిలో వచ్చే పంటలకు మార్కెటింగ్ సదుపాయాలు, ఎగుమతి  అవకాశాలు కల్పించాలి. వ్యవసాయ రంగానికి తక్కువ వడ్డీ తో రుణాలు ఇచ్చి, వ్యవసాయ సంబంధింత యంత్రాలకు ఎక్కువ వడ్డీకి రుణాలు ఇవ్వడం సరికాదు. వ్యవసాయ అనుబంధ రంగాలు బాగుపడాలంటే…తక్కువ వడ్డీకే యంత్రాలు కొనుగోలు చేసేలా సౌలభ్యం ఉండాలి అని అన్నారు

MOST RECENT

Facebook Page

canlı casino siteleri casino
evden eve nakliyat ev eşyası depolama izmir istanbul evden eve nakliyat